మంగళవారం 09 మార్చి 2021
Nirmal - Jan 18, 2021 , 02:16:46

అన్ని వార్డుల అభివృద్ధే లక్ష్యం

అన్ని వార్డుల అభివృద్ధే లక్ష్యం

నిర్మల్‌ అర్బన్‌, జనవరి17 : పట్టణంలో  అన్ని వార్డుల అభివృద్ధే లక్ష్యమని, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సహకారంతో ముందుకెళ్తామని మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ అన్నారు. పట్టణంలోని శాంతినగర్‌ జర్నలిస్ట్‌ కాలనీలో ఆదివారం ఆయన పర్యటించారు. కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలపై స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సహకారంతో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. కాలనీకి మొదటి సారిగా వచ్చిన చైర్మన్‌ ఈశ్వర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు పూదరి తిరుపతి, గౌరవాధ్యక్షుడు నాలం మదన్‌మోహన్‌, సభ్యులు కిశోర్‌ కుమార్‌, సంగారి శ్రీనివాస్‌, రాజు వర్మ, దేవేందర్‌ వర్మ, భోజన్న, పాల్గొన్నారు. 

VIDEOS

logo