శనివారం 27 ఫిబ్రవరి 2021
Nirmal - Jan 18, 2021 , 02:16:46

ఇటుక బట్టీల్లోనే.. ఇష్టమైన చదువు

ఇటుక బట్టీల్లోనే.. ఇష్టమైన చదువు

  • పిల్లలు ఇప్పుడిప్పుడే మొగ్గు చూపుతున్నారు.
  • కార్మికుల పిల్లలకు ఆన్‌లైన్‌ పాఠాలు
  • దాతల సహకారంతో టీవీల ఏర్పాటు
  • ఇప్పటికే నాలుగు చోట్ల ప్రయోగాత్మకంగా అమలు

నిర్మల్‌ టౌన్‌, జనవరి 17: జిల్లాలో మొత్తం 396 పంచాయతీలుండగా.. నిర్మల్‌, కౌట్ల, సారంగాపూర్‌, బీరవెల్లి, ప్యారమూర్‌, కుంటాల, ఓలా, ధని, కుభీర్‌, కనకాపూర్‌, పొన్కల్‌, ఖానాపూర్‌, బండల్‌ ఖానాపూర్‌, పెంబి, తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇటుకబట్టీలున్నాయి. వీటిలో పనిచేసేందుకు మహారాష్ట్రతో పాటు ఒడిశాకు చెందిన వలస కూలీలు తరలివచ్చారు. ఇప్పటికే ఇటుకబట్టీల సీజన్‌ ప్రారంభం కావడంతో వందలాది వలస కుటుంబాలు తమ పిల్లాపాపలతో యజమానుల వద్ద పని కుదుర్చుకున్నాయి. వీరు ప్రతిరోజూ అక్కడే పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా మే చివరివారం వరకు ఆయా బట్టీల్లో పను లు నిర్వహించనుండడంతో ఆ ప్రాంతంలోనే గుడిసెలు వేసుకున్నారు. వీరి పిల్లలు విద్యా సంవత్సరం నష్టపోకుండా జిల్లా బాలల సంరక్షణ అధికారులు ఆన్‌లైన్‌ పాఠాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. 

నాలుగుచోట్ల టీవీల ఏర్పాటు..

కార్మికుల పిల్లలకు పక్కాగా ఆన్‌లైన్‌ తరగతులు అందించాలనే ఉద్దేశంతో జిల్లా బాలల సంరక్షణాధికారులు ఇటుక బట్టి నివాస ప్రదేశంలోనే ప్రత్యేకంగా టీవీలను ఏర్పాటు చేస్తున్నారు. మొదట తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పిల్లలతో పనులు చేయించుకోవద్దని, నిత్యం సమీపంలోని పాఠశాలకు పంపించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆన్‌లైన్‌ విద్యాబోధన చేస్తుండడంతో ఇటుకబట్టీల యజమానుల సహకారంతో పాఠాలు వినేందుకు ప్రత్యేకంగా టీవీలను ఏర్పాటు చేస్తున్నారు. నిర్మల్‌ మండం కౌట్ల, ఖానాపూర్‌ మండలం బండల్‌ ఖానాపూర్‌, సారంగాపూర్‌ మండలం బీరవెల్లి, తదితర గ్రామాల్లో ఆన్‌లైన్‌ విద్యాబోధనకు అనుగుణంగా టీవీలు ఏర్పాటు చేశారు. వీరు జాతీయ దూరదర్శన్‌ చానెల్‌ ద్వారా వారివారి ప్రాంతీయ భాషలతో పాటు ఆంగ్లం ఎంచుకునేలా అవగాహన కల్పించి పాఠాలు వినే లా ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులతో పనులు చేయించుకుంటే యజమానులపై చర్య తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌ పాఠాల వైపు ఇటుకబట్టీలో పనిచేసే కార్మికుల 


VIDEOS

logo