బుధవారం 24 ఫిబ్రవరి 2021
Nirmal - Jan 17, 2021 , 01:51:34

బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శ

ఇంద్రవెల్లి, జనవరి 16 : మండలంలోని హీరాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని గోపాల్‌పూర్‌లో గురువారం రాత్రి గుడిసెకు నిప్పంటుకొని కనక రేణుకాబాయి(78) సజీవ దహనమవడంపై రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి సంతాపం వ్యక్తం చేశారు. గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంఘటనను జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీవో, జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. కాలిపోయిన 15 క్వింటాళ్ల పత్తికి నష్టపరిహారం కోసం, డబుల్‌ బెడ్‌ రూం మంజూరు కోసం అధికారులతో మాట్లాడుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎంఏ అమ్జద్‌, టీఆర్‌ఎస్‌ మాజీ మండలాధ్యక్షుడు షేక్‌ సుఫియాన్‌, సర్పంచ్‌ గోడం నాగోరావ్‌, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ తోడసం హరిదాస్‌, కారోబార్‌ మారుతి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo