బుధవారం 24 ఫిబ్రవరి 2021
Nirmal - Jan 17, 2021 , 01:48:50

పంట కల్లాలను పూర్తి చేయాలి

పంట కల్లాలను పూర్తి చేయాలి

నిర్మల్‌ టౌన్‌, జనవరి 16 : నిర్మల్‌ జిల్లాలో పంట కల్లాలను వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో పంట కల్లాలు, శ్మశానవాటికల నిర్మాణంపై శనివారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన శ్మశాన వాటికల నిర్మాణాలను అన్ని గ్రామాల్లో పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. రైతులు పంటలు ఆరబెట్టుకునేందుకు అవసరమైన పంట కల్లాల నిర్మాణాలను ప్రారంభించినందున ఆ పనులు వేగంగా జరిగేలా అధికారులు  పర్యవేక్షించాలని తెలిపారు. నిర్మల్‌ జిల్లాలో 2,662 పంట కల్లాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 50 శాతం పనులు ప్రారంభం కాగా, 20 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. సమావేశంలో డీఆర్డీవో వెంకటేశ్వర్లు, వ్యవసాయాధికారి అంజిప్రసాద్‌, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శరత్‌బాబు పాల్గొన్నారు. 


VIDEOS

logo