మౌలిక వసతుల కల్పనే ముఖ్యం

- నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ
- జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం
నిర్మల్ టౌన్, జనవరి 16 : కుంటాల మండలంలో నిర్వహిస్తున్న రూర్బన్ పనుల్లో మౌలిక వసతులు కల్పించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో రూర్బన్ పనులపై శనివారం జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 2021 మార్చి నాటికి మండలంలో చేపట్టిన పనులన్నీ పూర్తి చేయాలని తెలిపారు. ప్రస్తుతం ప్రారంభమైన పనులు, పురోగతిలో ఉన్నవి, ఇంకా ప్రారం భం కాని వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయా ల కల్పనకు ఈ పనులను వినియోగించుకోవాలని సూచించారు. పనులను వేగంగా నిర్వహించేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీ వో వెంకటేశ్వర్లు, జడ్పీసీఈవో సుధీర్‌కుమార్, డీపీవో వెంకటేశ్వర్లు, పం చాయతీరాజ్, విద్యుత్ శాఖ ఎస్ఈ జయవంత్‌రావు చౌహాన్, జిల్లా వైద్యాధికారి ధనరాజ్, సంబంధిత ఎంపీడీవో, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి..
నిర్మల్ జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో భూముల వివరాలను పక్కాగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆ దేశించారు. కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ధరణి పోర్టల్‌లో ప్రభుత్వం ఇచ్చిన ఐచ్ఛికాలను పరిగణనలోకి తీసుకొని రైతులకు పక్కాగా డిజిటల్ పాస్ పుస్తకాలు అందేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్ స్థాయిలో భూ వివాదాలకు సంబంధించిన ఏ అంశం ఉన్నా సంబంధిత రైతులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రెవె న్యూ పాలనపై ప్రభుత్వం సూచించిన సూచనలను తహసీల్దార్లకు వివరించారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్డీవో రమేశ్ రాథోడ్, భైంసా ఆర్డీవో రాజు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్‌స్టాలో జాన్ అబ్రహం షర్ట్‌లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్‌బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా