మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి

నిర్మల్ అర్బన్, జనవరి 15 : అయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర జిల్లా కన్వీనర్ మంచిరాల నాగభూషణం కోరారు. జిల్లా కేంద్రంలోని ఆర్కే కన్వెన్షన్‌లో శుక్రవారం ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. మందిరం నిర్మించాలనే సంకల్పంతో శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జనజాగరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు జిల్లాలోని ప్రతి ఇంటికీ వెళ్లి విరాళాలు సేకరించనున్నట్లు తెలిపారు. రూ.20 వేలకు మించి విరాళం అందించే వారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రచార ప్రముఖ్ మందుల వికేశ్, జిల్లా కో కన్వీనర్ సాదుల కృష్ణదాస్, ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ చాలక్ నూకల విజయ్ కుమార్, సహ కార్యదర్శి అశోక్, మహిళా ప్రముఖ్ శ్రీవాణి, సాహిత్య ప్రముఖ్ పతికె రాజేందర్, సమితి సభ్యులు ప్రవీణ్, అయ్యన్నగారి భూమయ్య, మెడిసెమ్మ రాజు, జాదవ్ విఠల్ రావు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పల్లె.. ప్రగతి బాట పట్టిందో..’
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్