మంగళవారం 02 మార్చి 2021
Nirmal - Jan 16, 2021 , 01:13:06

ఉమ్మడి జిల్లా ఓటర్లు @ 20,90,811

ఉమ్మడి జిల్లా ఓటర్లు @ 20,90,811

  • తుది జాబితా విడుదల చేసిన అధికారులు 
  • కొత్త ఓటర్లు 4,916 మందే..
  • గ్రామాల్లో బూత్‌ల వారీగా జాబితాల ప్రదర్శన

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకున్న విలువ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటు వజ్రాయుధం లాంటిది. అందుకే భారత ఎన్నికల కమిషన్‌ ప్రతియేటా 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రత్యేక ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కొత్తగా చేరిన ఓటర్లతో పాటు, స్థానచలనమైన వారు, చనిపోయిన వారి వివరాలు జాబితాలో మార్పులు చేర్పులు చేశారు. అనంతరం ఉమ్మడి జిల్లా ఓటర్ల జాబితాను శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారికంగా విడుదల చేశారు. 

నిర్మల్‌ టౌన్‌, జనవరి 15: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 20,90,811 ఓటర్లున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో సిర్పూర్‌, చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, బోథ్‌, నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాలు ఉన్నాయి.  వీటిలో ఓటర్ల ముసాయిదాకు 16.11.2020న డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జనవరి 1, 2020 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు అవకాశం కల్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌  జిల్లాలో10 నియోజకవర్గాల పరిధిలో 2,821 బీఎల్‌వో కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. నవంబర్‌ 21, 22, డిసెంబర్‌ 3, 4 తేదీల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. 

చేర్పులు, మార్పులు..

18 యేండ్లు నిండిన వారిని కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడం, చనిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం, ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల నమోదు, పోలింగ్‌ బూత్‌ల మార్పిడి, తప్పొప్పుల సవరణకు అవకాశం కల్పించారు. దీనిని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకున్నారు. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ సమయంలో ఉమ్మడి జిల్లాలో 20,86,615 మంది ఓటర్లు ఉన్నారు. 4,196 మంది ఓటర్లు కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నట్లు శుక్రవారం ప్రకటించిన జాబితాలో అధికారులు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చనిపోయిన, ఊరు వదిలి వెళ్లిపోయిన ఓటర్లను గుర్తించిన అధికారులు.. వారిని జాబితా నుంచి తొలగించారు. మొత్తం 17,515 మందిని తొలగించగా.. కొత్తగా 21,711 మందిని జాబితాలో చేర్చారు. తుది నోటిఫకేషన్‌ జాబితాను శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు విడుదల చేసి సంబంధిత గ్రామపంచాయతీల్లో బూత్‌ల వారీగా తుదిజాబితా ప్రదర్శించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. VIDEOS

logo