శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Jan 13, 2021 , 01:18:00

ముగ్గుల పోటీలు

ముగ్గుల పోటీలు

నిర్మల్‌ టౌన్‌, జనవరి 12 : పట్టణంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో మంగళవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ము గ్గుల పోటీలు నిర్వహించారు. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు ఈ పోటీలను నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షుడు తమ్మలపల్లి లక్ష్మణ్‌చారి తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించగా, 27 మం ది మహిళలు పాల్గొన్నారు. చుక్కల ముగ్గు ఆధారంగా ప్రతిభ చూపిన వారి కి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు సందీప్‌, శేఖర్‌రావు, దేవిదాస్‌, పండిత్‌రావు, సాయి, సంకేత్‌ పాల్గొన్నారు. 


logo