సోమవారం 25 జనవరి 2021
Nirmal - Jan 13, 2021 , 01:17:58

ఆడబిడ్డలకు అండగా ‘కల్యాణలక్ష్మి’

ఆడబిడ్డలకు అండగా ‘కల్యాణలక్ష్మి’

  • ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
  • తానూర్‌, భైంసాలో లబ్ధిదారులకు చెక్కుల అందజేత

తానూర్‌, జనవరి 12 : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నాయని ముథోల్‌ ఎమ్యెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. స్థానిక తహసీల్‌ కార్యాలయంలో మంగళవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 149 మంది లబ్ధిదారులకు రూ.కోటీ 49 లక్షల 17వేల 284 విలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడాలేని పథకాలు సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అమలుచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో హంగిర్గా సొసైటీ చైర్మన్‌ నారాయణ్‌రావు పటేల్‌, ఆత్మ చైర్మన్‌ కానుగంటి పోతారెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు బాశెట్టి రాజన్న, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు తాడేవార్‌ విఠల్‌, తహసీల్దార్‌ శ్యాంసుందర్‌, ఎస్‌ఐ గుడిపెల్లి రాజన్న, ఉప సర్పంచ్‌ షాన్‌వాజ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పిప్పెర గోపాల్‌, విఠల్‌, చంద్రశేఖర్‌, దార్మోడ్‌ రాములు, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆర్‌ఐ గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

భైంసా, జనవరి 12 : భైంసా పట్టణంలోని నర్సింహ కల్యాణ మండపంలో 209 మందికి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డలకు పెండ్లి కానుకగా రూ.లక్షా 116 అందించి, ఆర్థికంగా ఆదుకోవడంతో పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పిప్పెర కృష్ణ, వైస్‌ చైర్మన్‌ ఆసిఫ్‌, ఆర్డీవో రాజు, ఫారూఖ్‌, తోట రాము, సోలంకి భీంరావ్‌, ప్రసన్నజిత్‌ ఆగ్రే, కౌన్సిలర్‌ కపిల్‌, గాలి రవి తదితరులు పాల్గొన్నారు.


logo