బుధవారం 27 జనవరి 2021
Nirmal - Jan 11, 2021 , 01:47:19

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

దస్తురాబాద్‌, జనవరి10 : నిరుద్యోగ యువతీయువకులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని టాటా  స్ట్రైవ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ట్రైనర్‌ సతీశ్‌, సర్పంచ్‌ బాదం నిరోషా అన్నారు. ప్రతిమ ఫౌండేషన్‌, టాటా స్ట్రైవ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌  సెంటర్‌ ఆధ్వర్యంలో మండలంలోని బుట్టాపూర్‌ పంచాయతీలో ఆదివారం ఉచిత శిక్షణకు నిరుద్యోగుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి 30 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. బ్యాంకింగ్‌లో నాలుగు నెలలు, ఎలక్ట్రీషియన్‌, సోలార్‌ పవర్‌ సిస్టం, బైక్‌ మెకానిక్‌ అంశాల్లో మూడు నెలలు,  యువతులకు హోం హెల్త్‌ ఫుడ్‌లో 3 నెలల శిక్షణ ఉంటుందని ట్రైనర్‌ సతీశ్‌ తెలిపారు. శిక్షణ సమయంలో భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పించునున్నట్లు వెల్లడించారు.  మండలంలోని నిరుద్యోగ యువతీ యవకులు ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. వివిధ కోర్సులో శిక్షణకు గాను 20 మంది యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమంలో  ప్రతిమ ఫౌండేషన్‌ ప్రోగ్రాం ఆర్గనైజర్‌ అశోక్‌,   ట్రైనర్‌ శశాంక్‌ పాల్గొన్నారు. 


logo