మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Jan 11, 2021 , 01:05:51

ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం

ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం

  • మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి
  • లక్ష్మణచాంద రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన

లక్ష్మణచాంద, జనవరి 10 : నిర్మల్‌ జిల్లాను ఆధ్యాత్మిక కేం ద్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నా రు. స్థానిక రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ రూ.100 కోట్లు కేటాయించారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్మల్‌లో ఆలయాలను అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. కుల, మత రాజకీయం తప్పా బీజేపీకి సొంత అభివృద్ధి సిద్ధాంతం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఆ పార్టీ చేసిన అభివృద్ధిని చూపాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహిం వ్యక్తం చేశారు. 14 ఏళ్లపాటు రాష్ట్రం కోసం పోరాడి, కేసీఆర్‌ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ విషయం ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై వ్యంగ్యంగా మాట్లాడడం తగదన్నారు. విమర్శలు మాని అభివృద్ధికి ఏం చేస్తారో తెలుపాలని సూచించారు. కార్యక్రమంలో నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రఘునందన్‌ రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌, ఎంపీటీసీ అడ్వాల పద్మ, నాయకులు అడ్వాల రమేశ్‌, ఈటెల శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ అట్ల రాంరెడ్డి, జహీరొద్దీన్‌ పాల్గొన్నారు.


logo