గురువారం 21 జనవరి 2021
Nirmal - Jan 10, 2021 , 00:12:43

నిర్మల్‌జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుదాం

నిర్మల్‌జిల్లాను ఆధ్యాత్మిక  కేంద్రంగా  తీర్చిదిద్దుదాం

  • రూ. 100 కోట్లతో 500 ఆలయాల నిర్మాణ పనులు    
  • కదిలి ఆలయానికి  రూ. 10 కోట్ల నిధులు మంజూరు
  • రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి    
  • కదిలి, కాల్వ ఆలయాల పాలక వర్గాల ప్రమాణ స్వీకారం

దిలావర్‌పూర్‌, జనవరి 9 : నిర్మల్‌ను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుదామని,  రూ.100 కోట్లతో జిల్లాలో 500 ఆలయాలను నిర్మిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.  శనివారం దిలావర్‌పూర్‌ మండలంలోని కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కదిలి పాపహరేశ్వర ఆలయాల నూతన పాలక వర్గాల ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు.  అంతకు ముందు ఆయా ఆలయాల వద్ద మంత్రికి  ఆలయ పండితులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి గుండంపల్లిలో రూ.36 లక్షలతో  చేపట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అక్కడి నుంచి సముందర్‌పల్లిలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఆలయాల అభివృద్ధికి నిధులు వస్తున్నాయని చెప్పారు. నిర్మల్‌ జిల్లాలోని 500 ఆలయాలకు రూ. 100 కోట్ల నిధులు మంజూరు చేసి, నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. కదిలి పాపహరేశ్వర ఆలయ అభివృద్ధికి రూ. 10కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించినట్లు తెలిపారు. కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఇప్పటికే రూ.2 కోట్లతో పనులు చేపట్టగా మరో రూ. 3 కోట్ల నిధులను అభివృద్ధి పనుల కోసం మంజూరు చేస్తామని చెప్పారు. నిర్మల్‌ నియోజకవర్గంలోని ప్యాకేజీ 27 పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన మేరకే శ్రీకాల్వ లక్ష్మీ నరసింహస్వామి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ అని నామకరణం చేస్తామని చెప్పారు. యాద్రాది, ధర్మపురి తరువాత అతి పెద్ద దేవాలయం శ్రీ కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయమేనని తెలిపారు. 

కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పాలక వర్గం ఎన్నిక

ప్రసిద్ధ దేవాలయమైన కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పాలక వర్గ సభ్యులతో దేవాదాయ శాఖ డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికిషన్‌గౌడ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.. చైర్మన్‌గా  నిమ్మల చిన్న య్య, ఆలయ పాలక వర్గ సభ్యులుగా ఆదుముల గంగాధర్‌, ఎస్పీ కిషన్‌, శేరు చందు, మెగావత్‌ గంగుబాయి, రాంరెడ్డి, రామానుజ రాము, గట్టు నర్సయ్య సభ్యులుగా ఉన్నారు. వీరందరినీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శాలువా పూల మాలలతో  సన్మానించారు. 

కదిలి  పాపహరేశ్వర ఆలయ పాలక వర్గం..

కదిలి పాపహరేశ్వర నూతన ఆలయ పాలక వర్గం సభ్యులతో దేవాదాయ శాఖ డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికిషన్‌ గౌడ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ చైర్మన్‌గా నార్వాడే భుజంగ్‌రావు, డైరెక్టర్లుగా అట్టోలి ముత్యంరెడ్డి(దిలావర్‌పూర్‌), నిమ్మల రవి, అరిగెల చిన్నయ్య, కృష్ణగౌడ్‌, తరడం సునీత, శక్కరి ముత్యం, పంచాక్షరిని పాలక వర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిని మంత్రి పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ ఏలాల అమృత, సర్పంచ్‌లు అడెపు తిరుమల, శ్రీనివాస్‌, సరిత, రాజు, సంగీత, ఆకారపు గంగాలక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విజయలక్ష్మి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు ఏలాల చిన్నారెడ్డి,  జడ్పీటీసీ రమణారెడ్డి, సహకార సంఘం చైర్మన్‌ పీవీ రమణారెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కొడే రాజేశ్వర్‌, ఎఫ్‌ఎసీఎస్‌ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, నర్సపూర్‌(జీ) జడ్పీటీసీ రామయ్య, సర్పంచ్‌లు గంగారెడ్డి, రామ్‌రెడ్డి, భూమేశ్‌యాదవ్‌, నాయకులు  కోండ్రు రమేశ్‌, ఓడ్నం కృష్ణ, స్వామిగౌడ్‌, రామాగౌడ్‌, ధనే రవి దనే నర్సయ్య, ఆలయ కార్య నిర్వహణ  అధికారులు సదయ్య, భూమయ్య, కేశవు లు, మాధవ్‌రావు ఆలయ పండితులు పార్టీ నాయకులున్నారు.logo