శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Jan 09, 2021 , 01:32:55

నేడు లక్ష్మణచాందలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ

నేడు లక్ష్మణచాందలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ

నిర్మల్‌ అర్బన్‌,జనవరి 8 : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు నిర్మల్‌ నియోజక వర్గంలోని లక్ష్మణచాంద మండలం బోరిగాంలో నిర్మించిన 25 డబుల్‌ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి శనివారం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. లబ్ధిదారులు గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే ఇండ్లను మామిడాకులతో అలంకరించారు.