గురువారం 21 జనవరి 2021
Nirmal - Jan 09, 2021 , 01:32:55

క్రీడల్లో రాణించాలి

 క్రీడల్లో రాణించాలి

కుంటాల, జనవరి 8 : యువకులు క్రీడల్లో రాణించాలని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి అన్నారు. మండలంలోని కల్లూర్‌లో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జోనల్‌ స్థాయి క్రికెట్‌ పోటీలను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. యూత్‌ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ఏపీవో నవీన్‌, ఎంపీటీసీ దాసరి మధు, నాయకులు డాక్టర్‌ భోజన్న, వెంకటేశ్‌, దశరథ్‌, రజినీకాంత్‌, రమణాగౌడ్‌, నవీన్‌, దత్తు, నాగారావు, భూషణ్‌ పాల్గొన్నారు. 

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

ఓలా పంచాయతీ రాజాపూర్‌కు చెందిన  దత్తుకు సీఎంఆర్‌ ఎఫ్‌ నుంచి రూ. 55 వేలు మంజూరయ్యాయి. ముథోల్‌ ఎమ్మె ల్యే విఠల్‌ రెడ్డి తన నివాసంలో బాధిత కుటుంబానికి శుక్రవారం చెక్కు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు హైమద్‌ పాషా, ఎగ్గాం గణేశ్‌, జాదవ్‌ దత్తు ఉన్నారు. 

చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ నేడు

పెంచ్‌కల్‌పాడ్‌లో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి శనివారం ఆవిష్కరిస్తారని టీఆర్‌ఎస్‌ మం డల కన్వీనర్‌ పడకంటి దత్తు తెలిపారు. ప్రజాప్రతి నిధులు, నాయకులు హాజరు కావాలని కోరారు. 


logo