ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Jan 09, 2021 , 01:23:50

రైతుల సంక్షేమానికి కృషిn ప్రతిపక్షాలకు విమర్శించే అర్హత లేదు

రైతుల సంక్షేమానికి కృషిn ప్రతిపక్షాలకు విమర్శించే అర్హత లేదు

  • మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  • లోకేశ్వరం మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
  • పాల్గొన్న ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

లోకేశ్వరం, జనవరి 8 : రైతు సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర దేవాదాయ, గృహ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని బిలోలి గ్రామంలో శుక్రవారం అభయాంజనేయ ఆలయంతో పాటు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి రూ.25 లక్షల నిధులు దేవాదాయ శాఖ నుంచి మంజూరైనట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం రానున్న రోజుల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం, ఆలయ ప్రహరీ కోసం నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం రూ. 1.75 కోట్లతో నిర్మించిన 15 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తహసీల్‌ కార్యాలయ ఆవరణలో ఎస్‌ఆర్‌వో బిల్డింగ్‌ పనులను రూ.5 లక్షలతో ప్రారంభించారు. రూ.22 లక్షలతో నిర్మించిన రైతువేదిక భవనాన్ని ప్రారంభించారు. రైతు చట్టాలను పరిష్కరించాలని 45 రోజుల పాటు ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం కనీసం చర్చలకు పిలువడం లేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నిజామాబాద్‌ జడ్పీచైర్మన్‌ విఠల్‌రావు మాట్లాడుతూ.. బిలోలిలో సీసీ కెమెరాలను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీపీ బాయమొల్ల లలిత, జడ్పీటీసీ లోలం కళావతి, జడ్పీ మాజీ చైర్మన్‌ లోలం శ్యాంసుందర్‌, డీఎస్పీ నర్సింగ్‌రావు, సీఈ అజయ్‌బాబు, తహసీల్దార్‌ వెంకటరమణ, ఎంపీడీవో క్రాంతికుమారి, సర్పంచ్‌లు సవిత, సౌజన్య, ఎంపీటీసీలు విజయ, జయసాగర్‌రావు, నాయకులు రాజేశ్‌బాబు, వైస్‌ ఎంపీపీ నారాయణ్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌లో రైతు సేవా కేంద్రం ప్రారంభం

నిర్మల్‌ అర్బన్‌, జనవరి 8 : నిర్మల్‌ పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. నిర్మల్‌ జిల్లాలో రైతులు ఎక్కువగా ఉన్నందున మండలానికి మూడు ఆగ్రోస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, కౌన్సిలర్లు చౌహాస్‌, యశోద, నాయకులు నరేందర్‌, సురేందర్‌, నిఖిల్‌ పాల్గొన్నారు.


logo