ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Jan 07, 2021 , 01:48:29

పంచాయతీలకు ఆదాయం

పంచాయతీలకు ఆదాయం

  • ఖజానాకు చేరుతున్న డబ్బులు  
  • ఆన్‌లైన్‌ ద్వారా 4,863 అనుమతులు
  • రూ.1.46 కోట్ల ఆదాయం

సారంగాపూర్‌, జనవరి 6 : గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులైనా ఆన్‌లైన్‌లో ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని సేవలను అందుబాటులోకి తెచ్చింది. వారసంత, ఇంటి, నల్లా, భూమి అద్దె, నెలవారీ నీటి అద్దె డిపాజిట్‌, వ్యాపారం, ఇళ్ల నిర్మాణం, షాపింగ్‌ కాంప్లెక్స్‌, గ్రంథాలయం, సాధారణ విద్యుత్‌, డెత్‌, మ్యారేజ్‌ సర్టిఫికెట్లు, ఆస్తుల పేరిట మార్పిడితోపాటు ఇతరత్రా అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే మంజూరు చేస్తూ పంచాయతీలు ఆదాయాన్ని గడిస్తున్నాయి. దరఖాస్తుదారులకు సత్వర సేవలందడంతోపాటు గ్రామపంచాయతీల ఖజానా నిండుతున్నది.

జీపీల్లో ఈ-పాలన

పంచాయతీ వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లోనే జరగాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే పలు పంచాయతీల్లో కంప్యూటర్లు, ఆపరేటర్లను సమకూర్చింది. ఆపరేటర్లే గ్రామపంచాయతీల్లో జరిగే అభివృద్ధిని, ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. పల్లెల్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు.

4,863 దరఖాస్తులు

నిర్మల్‌ జిల్లాలో 18 మండలాల పరిధిలో 396 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు మీసేవ ద్వారా ఇంటి అనుమతుల కోసం 4,863 దరఖాస్తు చేసుకున్నారు. దీని ద్వారా సర్కారుకు రూ.1.46 కోట్ల ఆదాయం సమకూరింది. మీసేవలో చెల్లించిన సొమ్ము నేరుగా పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలోని ఖాతాకు జమవుతోందని అధికారులు చెబుతున్నారు. అక్కడి కార్యాలయానికి జిల్లా నుంచి ఎంత సొమ్ము జమవుతుందో చూసి అంతే మొత్తాన్ని తిరిగి జిల్లా పంచాయతీ అధికారి ఖాతాకు తదుపరి నెలలో జమ చేస్తారని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాకు చేరిన సొమ్మును మండలాలవారీగా పంపించి అక్కడి నుంచి పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తారు. 

ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌ చేసుకోవాలి

గ్రామాల్లో కొత్తగా చేపట్టే ఇంటి నిర్మా ణం అనుమతులు, ట్రేడ్‌ లైసెన్స్‌ జారీ, రెన్యువల్‌, బిల్డింగ్‌ లే అవుట్‌ వాటిని ప్రతి ఒక్కరూ మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసి సొమ్మును చెల్లించాలి. తాము పంపిన ఆదాయం ప్రభుత్వానికి వెళ్లుతుంది. అక్కడ నుంచి మళ్లీ పంపిన ఆదాయం పంచాయతీల ఖాతాల్లో జమ అవుతుంది. ఆన్‌లైన్‌తో ప్రజలకు సత్వర సేవలందుతాయి.

- వెంకటేశ్వర్‌రావు, డీపీవో, నిర్మల్‌logo