ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Jan 07, 2021 , 01:36:08

దళిత యువతకు ఉపాధి అవకాశాలు

దళిత యువతకు ఉపాధి అవకాశాలు

  • నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, జనవరి 6: జిల్లాలో దళిత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 2021-22 సంవత్సరానికి గాను ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌ రూపొందించినట్లు కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2020-21 యాక్షన్‌ ప్లాన్‌ అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. నిర్మల్‌ జిల్లాకు రూ. 13.36 కోట్ల నిధులను ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించారని తెలిపారు. ఇందులో రూ. 8కోట్ల 77 లక్షలు రాయితీ ఉంటుందని వివరించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 42 స్కీంలకు బ్యాంకు సబ్సిడీతో రుణాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ కార్పొరేష న్‌ ఏడీ హన్మాండ్లు, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హరికృష్ణ, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి స్రవంతి, బీసీ సంక్షేమశాఖ అధికారి రాజలింగం, ట్రైబల్‌ వెల్ఫేర్‌ జిల్లా అధికారి శ్రీనివాస్‌రెడ్డి, డీఏవో అంజిప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 

కల్లాలను వేగంగా పూర్తి చేయాలి

జిల్లాలో ఈజీఎస్‌ ద్వారా నిర్మిస్తున్న పంట కల్లాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ముషా రఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. కల్లాల నిర్మాణంపై ఎంపీడీవోలు, ఈజీఎస్‌ ఏపీవోలతో  జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, డీఆర్డీ వో వెంకటేశ్వర్లు, డీఏవో అంజిప్రసాద్‌, డీపీవో వెంకటేశ్వర్‌రావు, పీఆర్‌ ఈఈ శంకరయ్య, పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా తెలంగాణ అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన 2021 క్యాలెండర్‌, డైరీని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, డీఏవో అంజిప్రసాద్‌, ఉమ్మడి జిల్లా అగ్రిటెక్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌, వ్యవసాయశాఖ అధికారులు వీణారెడ్డి, రాజశేఖర్‌, సోమ లింగం, తదితరులు పాల్గొన్నారు. logo