శనివారం 16 జనవరి 2021
Nirmal - Jan 06, 2021 , 02:21:42

మూడు నెలల్లోపే గర్భిణులను గుర్తించాలి

మూడు నెలల్లోపే గర్భిణులను గుర్తించాలి

  • నిర్మల్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ  అధికారి ధన్‌రాజ్‌
  •  జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన

నిర్మల్‌ అర్బన్‌, జనవరి 5 : గర్భిణులను మొదటి మూడు నెలల్లోపే గుర్తించి వారి వివరాలను నమోదు చేయాలని నిర్మల్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ధన్‌రాజ్‌ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులను ముందుగానే గుర్తిస్తే వారికి ఉన్న అనారోగ్య సమస్యలను తెలుసుకొని మెరుగైన వైద్యం అందించవచ్చని పేర్కొన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, సిజేరియన్లతో కలిగే నష్టాలను వారికి వివరించాలని తెలిపారు. క్షయ, లెప్రసీ, కొవిడ్‌-19, అసంక్రమిత వ్యాధులు, ఇమ్యునైజేషన్‌ తదితర కార్యక్రమాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డిప్యూటీ డీహెంఎచ్‌వో చుక్క శ్రీకాంత్‌, ఆశిష్‌రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి అవినాశ్‌, వైద్యులు కార్తీక్‌, కిరణ్మయి, తదితరులు పాల్గొన్నారు.