శనివారం 23 జనవరి 2021
Nirmal - Jan 06, 2021 , 01:56:01

వేగవంతం చేయాలి

వేగవంతం చేయాలి

  • రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌ సుల్తానియా

నిర్మల్‌ టౌన్‌, జనవరి 5 : పల్లె ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌ సుల్తానియా ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించా రు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ప్రతి నెలా జీపీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నందునా, పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త డంపింగ్‌ ఏర్పాటు, శ్మశానవాటికలు, ఇంకుడుగుంతల నిర్మాణ పనులను లక్ష్యం మేరకు పూర్తిచేయాలన్నారు. కలెక్టరేట్‌లో డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జడ్పీసీఈవో సుధీర్‌కుమార్‌, డీపీవో వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు. 


logo