సంక్రాంతికి సర్వీసులు

- ఉమ్మడి జిల్లా నుంచి 198 ఆర్టీసీ బస్సులు
- nఈనెల 8-13 వరకు నడిపేందుకు ప్రణాళిక
- ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం
- ప్రయాణికుల సంక్షేమం కోసమే ప్రత్యేక చర్యలు
- ఆన్లైన్, ఫోన్ నంబర్ల ద్వారా బుకింగ్ సౌకర్యం
నిర్మల్ అర్బన్, జనవరి 4 : సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిం చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఆదిలా బాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూర్ డిపోల నుంచి రెగ్యులర్ బస్సులతోపాటు స్పెషల్ సర్వీసుల ను నడిపించాలని భావిస్తున్నది. ఈనెల 8 నుంచి 13 వరకు నడుస్తాయని, అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసుల సంఖ్యను పెంచే అవకాశం ఉందని, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
నిర్మల్ అర్బన్, జనవరి 4 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. పట్టణాలు, నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పోటీ పరీక్షలు, చదువు కోసం వెళ్లిన విద్యార్థులు, వ్యాపారం చేస్తూ ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు పండుగ సందర్భంగా సొంతూర్ల బాట పట్టనున్నారు. కొందరు సొంత వాహనాల్లో వెళ్లడానికి తయారవుతుండగా.. రైల్వే, ఆర్టీసీ సంస్థలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యేక రైళ్లు, సర్వీసులు నడుపడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాయి. ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు నిర్మల్, భైంసా, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూర్ డిపోల నుంచి రెగ్యులర్ బస్సులతోపాటు ప్రత్యేక సర్వీసులను నడుపనుంది. ఈనెల 8 నుంచి 13 వరకు నడుస్తాయని ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ రమేశ్ తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు.
ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం
చాలా మంది వివిధ పనుల కోసం హైదరాబాద్ వంటి నగరాల్లో స్థిరపడ్డారు. పండుగల సందర్భం గా సొంతూర్లకు వస్తుంటారు. ప్రయాణికులు తొందరగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వీరు అధిక చార్జీలు వసూలు చేస్తుండడం, పరిమితికి మించి ప్రయాణి కులను తీసుకెళ్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమా దాలను నివారించడంతోపాటు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ వంటి నగరాలకు బస్సులను నడుపనున్నారు.
ఆంధ్రాకు ప్రత్యేక బస్సులు
ఆదిలాబాద్ రీజియన్ నుంచి హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆంధ్రాకు చెందిన మేస్త్రీలు, కూలీలు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆయా డిపోల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు 27 సర్వీసులు నడుపనున్నారు. ఇందులో సూపర్ లగ్జరీలు 12, డీలక్స్‌లు 2, ఎక్స్‌ప్రెస్‌లు 13 నడుస్తాయి. ఆదిలాబాద్, నిర్మల్ డిపోల నుంచి 8 చొప్పున, భైంసా నుంచి 3, మంచిర్యాల నుంచి 6, ఆసిఫాబాద్ నుంచి 2 సర్వీసులను నడుపనున్నారు. ప్రయాణికుల రద్దీ పెరిగిన సర్వీసుల సంఖ్యను కూడా పెంచుతామని అధికారులు తెలిపారు.
ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోండి..
ప్రయాణికులకు మెరుగైన, సురక్షితమైన సేవలను అందించేందుకు ఆదిలాబాద్ రీజియన్ నుంచి హైదరాబాద్ వంటి నగరాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఈనెల 8 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ప్రణాళిక రూపొందించాం. సంక్రాంతికి 198 బస్సులను సిద్ధం చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కూడా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాం.
- రమేశ్, రీజినల్ మేనేజర్, ఆదిలాబాద్.
బుకింగ్ కౌంటర్ నంబర్లు ఇవే..
సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రదేశాలకు వెళ్లే ప్రయాణికులు www tsrtconline ద్వారా కానీ.. ఫోన్ నంబర్ల ద్వారా సీట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చు.
రిజర్వేషన్ బుకింగ్
డిపో ఫోన్ నంబర్
ఆదిలాబాద్ 73828 40334
ఆసిఫాబాద్ 73828 41031
నిర్మల్ 73828 42582
భైంసా 73828 41296
మంచిర్యాల 91604 88488