మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Jan 04, 2021 , 01:47:11

విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి

విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి

తాంసి, జనవరి3: రైతులు అధిక దిగుబడి వచ్చే కంది విత్తనాలు వేయాలని, విత్తనాల  ఎంపికలో జాగ్రత్తలు తీసుకో వాలని ఆదిలాబాద్‌ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త, ఇన్‌చార్జి డాక్టర్‌ శ్రీధర్‌ చౌహాన్‌ సూచించారు. జైనథ్‌ మం డలం పిప్పరవాడలో వికారాబాద్‌ జిల్లా వ్యవసాయ పరిశోధనా కేంద్రం వారు మన విత్తనం-మన తెలంగాణ కార్యక్రమంలో భాగంగా క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. గ్రామంలోని రైతు కిష్టారెడ్డి ఏఆర్‌ఎస్‌ హను మా వెరైటీ రకం విత్తనం ద్వారా సాగు చేస్తున్న కంది పంటను. ఆదివారం రైతులు, శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌చౌహాన్‌ మాట్లాడుతూ  వికారాబాద్‌ జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం ఏఆర్‌ఎస్‌ హనుమా వెరైటీ రకం కంది విత్తనాన్ని తయారు చేశారని, ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో దాదాపు 1200 ఎకరాల్లో ఈ విత్తనాలు వేశారని, 170 రోజుల్లోనే పంట వస్తుందని సూచించారు. క్షేత్రపర్యటనలో ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు అనిల్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

తెగుళ్లు రాకుండా చూడాలి

శనగ పంటలో రైతులు కొద్దిపాటి మెలకువలతో తెగుళ్లను నివారించవచ్చని వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త, ఇన్‌చార్జి డాక్టర్‌ శ్రీధర్‌ చౌహాన్‌ అన్నారు. ఆదిలాబాద్‌ మండలం అర్లిలో శనగ పంటను పరిశీలించారు. రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు. 


logo