సోమవారం 25 జనవరి 2021
Nirmal - Jan 04, 2021 , 01:47:09

ఘనంగా సావిత్రీబాయి ఫూలే జయంతి

ఘనంగా సావిత్రీబాయి ఫూలే జయంతి

నిర్మల్‌ అర్బన్‌/నిర్మల్‌ టౌన్‌ , జనవరి 3 : బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలో సావిత్రీ బాయిఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళాభ్యున్నతికి ఫూలే చేసిన సేవలను నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ కృష్ణంరాజు, జిల్లా కో కన్వీనర్లు రమేశ్‌, కిషన్‌, అశోక్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు మార్కంటి జీవన్‌, జిల్లా అధ్యక్షుడు ఎంబడి చంద్రశేఖర్‌, యువజన సంఘం నాయకులు హరీశ్‌, మురళీధర్‌, సతీశ్‌, అశోక్‌, నరేశ్‌ పాల్గొన్నారు. పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్‌లో సీట్లు సాధించిన మోక్ష, వినీషా, ప్రసన్నకుమారి, ఉపాధ్యాయులుగా ఎంపికైన రాజశ్రీ, శిరీషను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్‌, ఎంసీ లింగన్న, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి క్రాంతికిరణ్‌, సీనియర్‌ న్యాయవాది రాజలింగం, ఎస్సీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, మాజీ అధ్యక్షుడు గంగన్న, నాయకులు సాయిలు, రాజేశ్వర్‌, కొంతం అడెల్లు, న్యాయవాది రత్నం, నరహరి, రాజేశ్వర్‌ పాల్గొన్నారు.  

సారంగాపూర్‌, జనవరి 3:  మండలంలోని చించోలి(బి)లో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు కొంతం మురళీధర్‌, సుజీత్‌, సావన్‌, రవికుమార్‌, రూపేశ్‌, బొల్లరవి, నాగరాజు, అడెల్లు, సృజన్‌, శ్రావణ్‌, ప్రభాస్‌, రమేశ్‌  పాల్గొన్నారు. 

ఖానాపూర్‌ టౌన్‌, జనవరి 3:  పట్టణంలోని పాత బస్టాండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద సావిత్రీబాయి పూలే చిత్ర పటానికి అంబేద్కర్‌ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వొల్గుల వెంకటేశ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు ద్యావతి రాజేశ్వర్‌, నాయకులు కన్వీనర్‌ దాసరి రాజన్న, సతీశ్‌, దాసరి రాజేశ్వర్‌, అశోక్‌, పల్లెర్ల శ్రీనివాస్‌, నేత శ్యాం, శ్రీహరి, పెద్దులు, సురేశ్‌, ఆర్వీ చలం, నారాయణ, నాగరాజు, మధు, సయ్యద్‌ మహమూద్‌, పోశవ్వ ఉన్నారు.

భైంసా టౌన్‌, జనవరి 3: తిమ్మాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దళిత, బహుజన సంఘాల నాయకులు ఎల్లన్న , చాకెటి లస్మన్న, ఎంపీటీసీ చాకెటి అశోక్‌ , డాక్టర్‌ రాజు, భాస్కర్‌ , రామారావు, సాయిలు, శీను, మహేశ్‌, రవి, విజయ్‌ పాల్గొన్నారు.

దస్తురాబాద్‌, జనవరి 3:  మండలంలోని గొడిసెర్యాల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సావిత్రీ బాయి ఫూలే చిత్రపటానికి సర్పంచ్‌ ఒడిసె పోశవ్వ, ఉపాధ్యాయులు పూల మాల వేసి నివాళులర్పించారు. భీం సేన యువజన సం ఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ మాణిక్‌ రావు, చైర్మన్‌ రాజు, ఉపాధ్యాయులు, భీం సేన యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

కడెం,జనవరి 3:  తెలంగాణ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గంగాపూర్‌లో, నచ్చన్‌ ఎల్లాపూర్‌లో సావిత్రీ బాయి పూలే జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు చంద్రహాస్‌, సదర్‌లాల్‌ నాయక్‌, ఉర్వేత భీం, ఆనంద్‌ రావు, బొడ్డు గంగన్న, ఎంపీటీసీ దాసు నాయక్‌, అంగన్వాడీ టీచర్‌ హరిప్రియ, విద్యార్థి సంఘం నాయకులు సత్యం, జెట్టి సాయి కుమార్‌, రాజేశ్‌ పాల్గొన్నారు.

లోకేశ్వరం, జనవరి 3 : రాజూరా, ఎడ్‌దూర్‌ పొట్‌పెల్లి, పుస్పూర్‌,  పంచగుడి, కన్కాపూర్‌లో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో అంబేద్కర్‌ సంఘం నాయకులు పురుషోత్తం, శ్రీనివాస్‌, నారాయణ,ప్రసాద్‌, రాజు, హర్ష ముత్తన్న, శ్రీరాములు, పోశెట్టి, చందు, జలేందర్‌ ఉన్నారు. 

పెంబి, జనవరి 3: మండల కేంద్రంలో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి డీవైఎఫ్‌ఐ నాయకుడు రాజశేఖర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. 

కుంటాల, జనవరి 3 : కల్లూర్‌లో  సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పంచాయతీ కార్యదర్శి గాయత్రి, నాయకులు నవీన్‌, దశరథ్‌, భోసన్న, ప్రతాప్‌ రెడ్డి, శ్రీను తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. 

 ముథోల్‌, జనవరి 3 : మండల కేంద్రంలో సావిత్రీ బాయి పూలే చిత్రపటానికి మహిళలు, గ్రామస్తులు పూలమాల వేసి నివాళులర్పించారు.  


logo