సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలి

చెన్నూర్, జనవరి 2: షెడ్యూల్డు కులాల కార్యాచరణ ప్రణాళిక కింద సబ్సీడీ రుణాలు పొందేందుకు పట్టణంలోని అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ శనివారం తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, కులం, ఆదాయం, ఆహార భద్రత కార్డు, వి ద్యార్హత ధ్రువీకరణ ప్రతాలతో పాటుగా పాస్ సైజు ఫొటోతో ఆన్లైన్ ద్వారా ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. వ్యవసాయేతర పథకాలకు 21నుంచి 50సంవత్సరాలు, వ్యవసాయ పథకాలకు 21నుంచి 60సంవత్సరాలు, శిక్షణ పథకాలకు 18నుంచి 45సంవత్సరాల్లోపు వయస్సున్న వారు అర్హులని ఆయన తెలిపారు. 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే రుణం పొందిన వారు అనర్హులని ఆయన తెలిపారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే సబ్సిడీ రుణం అందజేస్తారని పేర్కొన్నారు. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని ప్రతిని మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని కోరారు.