ట్రాన్స్‌పోర్టు వాహనదారులకు సర్కారు అండ

- మూడు జిల్లాల్లో 31,470 మందికి లబ్ధి.. రూ.18.50 కోట్ల పన్ను మాఫీ
- చెల్లించిన వారికి సర్దుబాటు దిశగా చర్యలు
- ప్రభుత్వ నిర్ణయంపై వాహనదారుల హర్షం
- కరోనా కాలానికి సంబంధించి ఆరు నెలల వాహన పన్ను రద్దు
నిర్మల్ అర్బన్/ఎదులాపురం/ఆసిఫాబాద్, జనవరి 2 : తెలంగాణ సర్కారు ట్రాన్స్‌పోర్టు వాహనదారులకు నూతన సంవత్సరం సందర్భంగా తీపికబురు అందించింది. కరోనా కారణంగా తొమ్మిది నెలలపాటు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న కమర్షియల్ వాహనదారులకు ఆరు నెలల పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది వరకే చెల్లించిన వారికి రానున్న త్రైమాసిక పన్నుల్లో కలుపనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12,181 వాహనాలకు రూ.9 కోట్లు, నిర్మల్ జిల్లాలో 9,306 మందికి రూ.4.50 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 9,983 మందికి రూ.5 కోట్లు మాఫీ కానున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాన్స్‌పోర్టు
వాహనాలను నడిపేవారు ప్రతి ఏడాదికి నాలుగు సార్లు వాహన పన్నును చెల్లించాలి. మార్చిలో విజృంభించిన కరోనా వైరస్ కారణంగా వాహన రంగంపై ఆధారపడిన యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు నడువకపోవడంతో అప్పులు చేసి పన్నులు కట్టారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ పన్ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట మేరకు మార్చి-సెప్టెంబర్ వరకు పన్ను మాఫీ కానుంది. కాగా.. తెలంగాణ సర్కారు మోటారు వాహనాలపై పన్ను మాఫీ చేయాలని తీసుకున్న నిర్ణయంతో వాహన యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినతులు, ధర్నాలు లేకుండా ఇబ్బందులు గుర్తించి నిర్ణయం తీసుకోవడంతో సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.రూ.60 వేల పన్ను మాఫీ అయింది.. నాకు రెండు లారీలు, ఒక టిప్పర్ ఉంది. కరోనా సమయంలో వాహనాలు నడువక తీవ్ర ఇబ్బందులు పడ్డా. డ్రైవర్లకు జీతాలు చెల్లించడం, వాహన పన్ను కట్టడానికి డబ్బు లేకుంటే అప్పులు చేసి చెల్లించా. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నాకు దాదాపు రూ.60 వేల వరకు పన్ను మాఫీ కానుంది.
- గాజుల రవి, నిర్మల్.
కష్టాలు తెలిసిన కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసు. కరోనా కారణంగా అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. ఇలాంటి తరుణంలో వాహనాల పన్ను కట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. అప్పులు చేసి ట్యాక్స్‌లు కట్టే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఈ సమయంలో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది.
- సంపంగి వెంకటేశ్, నిర్మల్.
పన్ను రద్దుతో లాభం..
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 12,181 వాహ నాలు ఉన్నాయి. మార్చి నాలుగో వారంలో లాక్డౌన్ విధించారు. దీని వల్ల వాహన రంగంలో గిరాకీ లేక చాలా అవస్థలు పడ్డాం. కరోనా నేపథ్యంలో వాహనాలకు సంబంధించిన పన్నును రెండు త్రైమాసికాలకు మాఫీ చేయడం హర్షణీయం. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. రూ.9 కోట్ల దాకా యాజమానులకు లాభం జరుగుతుంది.
-షౌకత్ హుస్సేన్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
చాలా మందికి మేలు..
రెండు విడుతలు వాహనాల పన్ను రద్దు చేయడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. కరోనా కాలంలో వ్యాపారం లేక పన్ను కట్టలేకపోయాం. చాలా ఇబ్బందులు పడ్డాం. ఆరు నెలల పన్ను ఎలా చెల్లించాలో తెలియక సతమతమయ్యాం. సీఎం కేసీఆర్ పెద్ద మనుసుతో మా బాధను అర్థం చేసుకున్నడు. ఈ నిర్ణయంతో చాలా మందికి మేలు జరుగుతుంది. మేము కట్టాల్సిన పన్ను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నాం.
- ప్రమోద్ కుమార్ ఖత్రి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
తాజావార్తలు
- తక్కువ వడ్డీరేట్లు.. ఇంటి రుణానికి ఇదే సరైన టైం!
- అనుమానం వద్దు.. తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల
- వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు
- భారీ మొసలిని కాపాడిన వన్యప్రాణుల సంరక్షకులు
- మిలిటరీతో లింక్స్:జియోమీపై ట్రంప్ నిషేధం!
- ప్రణాళికా బద్దంగా పని చేయాలి : వినోద్ కుమార్
- కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష
- తెలంగాణ ఓటరు జాబితా ప్రకటన..
- మోడీ అనుచరుడికి మండలి సీటు
- స్టాక్స్ ’ఫ్రై’డే: నిమిషానికి రూ.575 కోట్లు లాస్