బుధవారం 27 జనవరి 2021
Nirmal - Jan 02, 2021 , 00:37:01

కొత్త సంవత్సరంలో..కొత్త లోకంలోకి..

కొత్త సంవత్సరంలో..కొత్త లోకంలోకి..

నిర్మల్‌ టౌన్‌ జనవరి 1 : 2021 సంవత్సరం ఆరంభం రోజున నిర్మల్‌ పట్టణంలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో నలుగురు పిల్లలు జన్మించారు. జనవరి 1న వారు జన్మించడంతో ఎప్పటికీ గుర్తించుకుంటామని తల్లిదండ్రులు, బంధువులు సంతోషించారు. నిర్మల్‌ పట్టణానికి చెందిన సుల్తానా, ప్రమీల, వనిత, మరొకరు శుక్రవారం ప్రసవించారు. ఒకరికి సాధారణ ప్రసవం కాగా మగబిడ్డ జన్మించాడు. మిగతా ముగ్గురు ఆడబిడ్డలే. వీరిని ఇంక్యుబెటర్‌లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. logo