సోమవారం 25 జనవరి 2021
Nirmal - Jan 02, 2021 , 00:37:05

పర్యాటక రంగ అభివృద్ధికి కృషి

పర్యాటక రంగ అభివృద్ధికి కృషి

  •  రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 
  • నిర్మల్‌లో శ్యాంగఢ్‌ కోటలో లైటింగ్‌ ప్రారంభం

నిర్మల్‌ అర్బన్‌, జనవరి1 : జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని శ్యాంగఢ్‌ కోట చుట్టూ మున్సిపల్‌ నిధులు రూ.16.50 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన లైటింగ్‌ను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పురాతన కోటలను పరిరక్షించి, అభివృద్ధి చేస్తానన్నారు. కంచరోని చెరువులో బోటింగ్‌ సదుపాయాన్ని కల్పించినట్లయితే పట్టణ వాసులకు ఆహ్లాద వాతావరణం ఏర్పడుతుందన్నారు. సోన్‌ పురాతన బ్రిడ్జి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ అధికారులకు సూచించారు. వీధి వ్యాపారులకు రుణాలు  అందించడంలో దేశంలో ప్రథమ స్థానంలో నిలవడంపై అధికారులను అభినందించారు. అంతకుముందు మంజులాపూర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైటింగ్‌ను ప్రారంభించారు.

 ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, జిల్లా గ్రంథాలయ  సంస్థ చైర్మన్‌ రాజేందర్‌, నిర్మల్‌ ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ ఆయా వార్డుల కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


logo