శనివారం 16 జనవరి 2021
Nirmal - Jan 01, 2021 , 03:58:21

నిధులు కేటాయించాలని మంత్రికి వినతి

నిధులు కేటాయించాలని మంత్రికి వినతి

భైంసా, డిసెంబర్‌ 31: భైంసా మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు విన్నవించారు.  ప్రగతిభవన్‌లో గురువారం ఆయనను మర్యాదపూర్వకంగా  కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో భైంసా మున్సిపల్‌ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు  తెలిపారు.