ఆదివారం 17 జనవరి 2021
Nirmal - Jan 01, 2021 , 02:37:05

బైబై 2020.. వెల్కమ్‌ 2021

బైబై 2020.. వెల్కమ్‌ 2021

నిర్మల్‌ అర్బన్‌ / ఆదిలాబాద్‌ రూరల్‌, డిసెంబర్‌ 31: నూతన సంవత్సరానికి ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, భైంసా, బాసర, ఖానాపూర్‌, తదితర పట్టణాల్లో ముఖ్య కూడళ్లు, రోడ్లపై యువత సందడి కనిపించింది. కేక్‌లు కట్‌ చేస్తూ, ఒకొరికొకరు శుభాకాం క్షలు తెలుపుకున్నారు. బైబై 2020.. వెల్కమ్‌ 2021 అంటూ సందడి చేశారు. పలు చోట్ల యువకులు అర్ధరాత్రి వరకు నృత్యాలు చేస్తూ, కేరింతలతో హోరెత్తించారు. కేక్‌ కట్‌ చేసి, కొత్త ఏడాదికి సంబురంగా స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం నుంచే ప్రధాన మార్కెట్‌ ఏరియాల్లో సందడి నెలకొనగా, బేకరీలు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, హోటళ్లు కిటకిటలాడాయి. కొవిడ్‌ నిబంధనలు అమల్లో ఉండడంతో గతేడాది కంటే కొంత నిరాడంబరంగానే వేడుకల్లో పాల్గొన్నారు. మంచిర్యాలలోని తన నివాసంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రవీణ్‌, గురువయ్యతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.