గురువారం 28 జనవరి 2021
Nirmal - Jan 01, 2021 , 03:38:20

‘హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్‌'

‘హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్‌'

  • 2021కి గ్రాండ్‌ వెల్‌కం పలికిన ఉమ్మడి జిల్లావాసులు
  • అర్ధరాత్రి అంబరాన్నంటిన ‘నూతన’ సంబురాలు  
  •  స్పెషల్‌ ఆఫర్లతో ఆకట్టుకున్న వ్యాపారులు

నిర్మల్‌ అర్బన్‌/ ఆదిలాబాద్‌ రూరల్‌, డిసెంబర్‌ 31:  అర్ధరాత్రి న్యూ ఇయర్‌ హంగామా అట్టహాసంగా మొదలైంది. ‘హ్యాపీ న్యూ ఇయర్‌' ‘హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్‌' అంటూ ఆనందోత్సాహాల నడుమ 2021కు ఉమ్మడి జిల్లా ప్రజానీకం ఆత్మీయ స్వాగతం పలికారు. 2020కు గుడ్‌బై చెప్పిన యువతీయువకులు, ఆటపాటలతో హోరెత్తించారు. కేకులు కట్‌చేసి, పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వ్యాపారులు స్పెషల్‌ ఆఫర్లతో ఆకట్టుకోగా, మద్యం దుకాణాల వద్ద బారులు కనిపించాయి. సరికొత్త నిర్ణయాలు, ఉన్నత లక్ష్యాలు, కొంగొత్త ఆశయాలతో ఉత్సాహంగా ముందుకెళ్లేలా ఆహ్వానం పలికారు.logo