సోమవారం 25 జనవరి 2021
Nirmal - Dec 31, 2020 , 02:42:38

డాక్టర్‌ వేణుగోపాల్‌కు జాతీయ పురస్కారం

డాక్టర్‌ వేణుగోపాల్‌కు జాతీయ పురస్కారం

నిర్మల్‌ అర్బన్‌ : నిర్మల్‌ పట్టణంలోని ఏరియా దవాఖానలో ఆర్‌ఎంవోగా  విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ వేణుగోపాలకృష్ణ మిషన్‌ ఆఫ్‌ హెచ్‌ఆర్‌డీఏ నుంచి గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. కొవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించినందుకు ఈ అవార్డు దక్కిందని తెలిపారు. ఇదివరకే కరోనా-2020 జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. జాతీయ పురస్కారం అందుకున్న వేణుగోపాల్‌ను ప లువురు వైద్యులు, దవాఖాన సిబ్బం ది అభినందించారు.

టీఎన్‌జీవో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో..

మినిస్ట్రీ ఆఫ్‌ ఉమెన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ (హెచ్‌ఆర్‌డీఏ) నుంచి గ్లోబల్‌ ఎక్స్‌లెన్సీ జాతీయ పురస్కారం అందుకున్న డాక్టర్‌ వేణుగోపాలకృష్ణను టీఎన్‌జీవో ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ అధ్యక్షుడు ఎన్‌.ప్రభాకర్‌, కార్యదర్శి రవి కుమార్‌, సిబ్బంది అమీర్‌, చంద్ర సుజాత, శోభ పాల్గొన్నారు.logo