దళిత యువతకు ఆర్థిక దన్ను

నిర్మల్ టౌన్ : తెలంగాణ ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు యాక్షన్‌ప్లాన్‌ను విడుదల చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించేందుకు బ్యాంకు లింకేజీ రుణాలతో పాటు సబ్సిడీ రుణాలను కూ డా విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు ఉండగా, 2020-21 సంవత్సరానికిగాను 1505 యూనిట్లు మంజూరు చేసింది. మొత్తం రూ. 66 కోట్లు విడుదల చేయగా, ఇందు లో బ్యాంకు సబ్సిడీ కింద రూ. 43.76 కోట్లు, నాన్ బ్యాంకింగ్ కింద రూ. 22. 24 కోట్లు కేటాయించారు. ఈ యూనిట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకే అత్యంత ప్రాధాన్యమివ్వడంతో పాటు
కుటీర పరిశ్రమలు, కులవృత్తుల, తదితర సంక్షేమ రంగాలకు నిధులు కేటాయించారు. నిర్మల్ జిల్లాకు రూ. 315 కోట్లు కే టాయించగా, బ్యాంకు లింకేజీ ద్వారా 176, బ్యాంకేతర రుణాల కింద 134 యూనిట్లు కేటాయించారు. మంచిర్యాల జిల్లాలో 676 యూనిట్లకు బ్యాంకు లింకేజీ ద్వారా 442 కేటాయించగా, 234 బ్యాంకేతర యూనిట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 263 యూనిట్లకు 165 బా్ంయకు లింకేజీ, 98 బ్యాంకేతర యూనిట్లు, ఆదిలాబాద్ జిల్లాలో 256 యూనిట్లకు బ్యాంకు లింకేజీ ద్వారా 135, బ్యాంకేతర యూనిట్లు 121 కేటాయించారు. ఇందులో పురుషులు, స్త్రీలు, దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించేందుకు ఆయా జిల్లాలకు లక్ష్యాలను విధించా రు. ఈ మేరకు రుణాలు అందించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహ రిస్తూ.. ఎస్సీ కార్పొరేషన్ ఏడీలు, బ్యాంకు అధికారులకు లక్ష్యాలను ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మండలాల వారీగా కోటాను కేటాయించారు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 42 స్కీంలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దళిత యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 42 స్కీంలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మినీ డెయిరీలు, సిమెంట్ పరిశ్రమ, చేపల కుంటలు, మొబైల్ టిఫిన్ సెంటర్లు, పేపరు ప్లేట్లు, టైలరింగ్, పసుపు మిషన్లు, మినీ దాల్మిల్, చెప్పుల దుకాణం, డిజటల్ నెట్వర్క్, వివిధ చిరువ్యాపార దుకాణాలతో పాటు ట్రాక్టర్లు, సరుకు రవాణాకు ఉపయోగపడే వాహనాలు అందించనున్నది. గ్రా మీణ ప్రాంతాల్లో 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండి, ఆదాయం రూ. లక్షా 50 వేల ఆదాయం ఉన్నవారు అర్హులుగా నిర్ణయించింది.
ఇక పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల ఆదాయం ఉన్న వారు అర్హులుగా ప్రకటించింది. ఇప్పటి వరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి రుణం తీసుకోనివారు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 21లోపు అన్ని వివరాలతో ఆన్లైన్లో దరఖా స్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. రూ. లక్ష లోపు యూనిట్లు ఉన్న వారికి 80 శాతం సబ్సిడీ, రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ, రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 40 శాతం సబ్సిడీ అందించనున్నది. వ్యవసాయానికి ఉపయోగించుకునే వాహనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో ట్రాక్టర్లు, హార్వేస్టర్లు, వరి నాటు యంత్రాలు, పవర్ టిల్లర్, సరుకు రవాణా వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, త్రీవీలర్ ఆటోలు, హార్టికల్చర్, అగ్రికల్చర్ పరిశ్రమలు, డెయిరీ ఫాంలు, చెప్పుల పరిశ్రమలు, కోళ్ల పరిశ్రమలు, దుకాణాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం మండల స్థాయిలో ఎంపీడీవోల పర్యవేక్షణలో యూనిట్ల ఎంపి క ఉంటుంది. అంతకుముందు గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఎస్సీ సబ్‌ప్లాన్ అమలుకు జిల్లా చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరించనుండగా, కన్వీనర్‌గా ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు సభ్యులుగా, బ్యాంకు ఎల్డీఎంలు వ్యవహరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులు కులధ్రువీకరణపత్రాలతో పాటు ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, ఎంపిక చేసిన యూనిట్, వాహనం కావాలనుకుంటే డ్రైవింగ్ లైసెన్సు, ఇతర వివరాలతో ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఏడీ హన్మాండ్లు సూచించారు.
తాజావార్తలు
- అరుదైన సీతాకోక చిలుక
- యాదాద్రి పనుల్లో వేగం పెంచాలి
- పూదోటల కిసాన్!
- హింస.. వారి కుట్రే
- రైతులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండను నిరసించాలి
- పక్కా ప్రణాళికతో పట్టణాభివృద్ధి
- ప్రగతి పథంలో నూతన మున్సిపాలిటీ
- టీఆర్ఎస్ యూత్ మడిపల్లి అధ్యక్షుడిగా ప్రకాశ్‌గౌడ్
- పండ్ల మార్కెట్లో బినామీల దందా
- రోదసి టికెట్.. 400 కోట్లు!