శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Dec 30, 2020 , 02:13:22

లంబాడాలను తొలగించే దాకా పోరాటం

లంబాడాలను తొలగించే దాకా పోరాటం

నిర్మల్‌ టౌన్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఆదివాసుల ఉద్యమం ఆగదని ఎంపీ సోయం బాపురావు అన్నారు. మంగళవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్‌ కార్యాలయంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ నిర్మల్‌లో బహిరంగసభ నిర్వహిస్తామని తెలిపారు. దీనికి పెద్ద ఎత్తున ఆదివాసులు తరలిరావాలని కోరారు. సమావేశంలో జిల్లా నాయకులు భూమయ్య, మల్లేశ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. logo