‘ఆత్మనిర్భర్'లో నిర్మల్ టాప్

- దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిన మున్సిపాలిటీ
- లక్ష జనాభాలోపు పట్టణాల విభాగంలో ప్రథమం
- 80.94శాతం చిరు వ్యాపారులకు రుణ వితరణ
నిర్మల్ అర్బన్: కొవిడ్ - 19 కారణంగా ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆత్మనిర్భర్, పీఎం స్వనిధి పథకం ద్వారా రూ. 10 వేలు రుణంగా అందిస్తున్నాయి. లక్ష జనాభా లోపు ఉన్న పట్టణాల్లో రుణ మంజూరులో నిర్మల్ మున్సిపాలిటీ దేశంలోనే ప్రథమ స్థానం దక్కించుకుందని జిల్లా మెప్మా కో ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీలో రుణ మంజూ రు కోసం 5798 మందిని గుర్తించగా, 5130 మంది పట్టణంలోని 22 బ్యాంక్ బ్రాంచీల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 4604 మంది లబ్ధి దారులను అర్హులుగా గుర్తించగా, 4150 మందికి రూ.10 వేల చొప్పున రుణాలను అందించారు. దీంతో 80.94 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచారు. లబ్ధిదారులను గుర్తించి వేగంగా రుణ మంజూరుకు కృషి చేసిన మెప్మా సిబ్బందిని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కమిషనర్ బాలకృష్ణ అభినందించారు.
ఏఆర్ సిబ్బందికి పరీక్షలు
హాజీపూర్ : సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజీవ్ పర్యవేక్షణలో ఏఆర్ సిబ్బందికి మంగళవారం డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు పరిశీలించి ఎంపిక చేశారు.
తాజావార్తలు
- రామ మందిరానికి వజ్రాల వ్యాపారుల రూ.17 కోట్ల విరాళాలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయావతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ