గురువారం 28 జనవరి 2021
Nirmal - Dec 29, 2020 , 00:54:46

ఆలయాల అభివృద్ధికి కృషి

ఆలయాల అభివృద్ధికి కృషి

  •  కరోనా వైరస్‌ తొలగిపోవాలి
  •  కొత్త యేడాదిలో ప్రజలు  సుఖశాంతులతో ఉండాలి
  •  రాష్ట్ర దేవాదాయ శాఖ   మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  •  నిర్మల్‌ పట్టణం, మామడ,   లక్ష్మణచాంద, సారంగాపూర్‌   మండలాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనలు
  •  పాల్గొన్న మంత్రి, జడ్పీ చైర్‌పర్సన్‌  విజయలక్ష్మి

మామడ / నిర్మల్‌ అర్బన్‌ / లక్ష్మణచాంద / సారంగాపూర్‌ : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మామడ తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన జగదాంబదేవి, సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో సోమవారం పాల్గొన్నారు. మామడలో భీమన్న ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్‌లో నూతనంగా నిర్మిం చిన శివకోటి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుకల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి అల్లోలకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

వేద  మంత్రోచ్ఛరణల మధ్య ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్‌ గ్రామంలో దుర్గామాత ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా ఆలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. సారంగాపూర్‌ మండలంలోని జవుళి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు నిర్మల్‌ నియోజకవర్గంలో ఎన్నో ఆలయాలు నిర్మించినట్లు పేర్కొన్నారు. కరోనా తీవ్రత పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరిస్తూ నిబంధనలు పాటించాలన్నారు. కొత్త సంవత్సరంలో అంతా శుభమే జరుగాలని, జిల్లా అభివృద్ధికి భగవంతుడు సహకరించాలని, కరోనా వైరస్‌ తొలగిపోయి అందరూ సుఖశాంతులతో ఉండాలని దేవున్ని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శివకోటి ఆలయ కమిటీ సభ్యులు మంత్రి అల్లోల, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మిని పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు.

అనంతరం నిర్మల్‌ పట్టణంలోని కుభేర మల్టీరెస్టారెంట్‌, మధుసూదన్‌ మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగింపు పోటీలను ప్రారంభించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేందర్‌, నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్మదాముత్యంరెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజిగారి రాజేందర్‌, ఆలయ అధ్యక్షులు మారుగొండ రాము, కౌన్సిలర్‌ నేరెళ్ల వేణు, నాయకులు రాంకిషన్‌ రెడ్డి, లక్కాడి జగన్‌మోహన్‌ రెడ్డి, మారుగొండ నరేందర్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్‌రాంరెడ్డి, సారంగాపూర్‌ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, సారంగాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వంగ రవీందర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ ఐర నారాయణరెడ్డి, సర్పంచ్‌లు భాగ్యలక్ష్మి, రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ భోజారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ మాధవరావు, నాయకులు రాజ్‌మహ్మద్‌, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణచాందలో మంత్రి సోదరుడు సురేందర్‌రెడ్డి, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ సంగం రాజు, నాయకులు అడ్వాల రమేశ్‌, గుజ్జా రి గణేశ్‌, సాతం గంగారాం, కేశం రమేశ్‌, జహీరొద్దీన్‌, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.logo