ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

- నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలి
- మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ అర్బన్ : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో ఆదివారం నిర్వహించిన మండల పడి పూజ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావనను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం 2021 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించి, అన్నదానం ప్రారంభించారు. 2021 సంవత్సరంలో అంతా శుభమే జరగాలనీ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అల్లోల మురళీధర్ రెడ్డి-వినోదమ్మ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయ ణ గౌడ్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, కౌన్సిలర్ కే సబిత, ఆలయ గురుస్వామి నవయు గమూర్తి, గురుస్వామి రాజన్ నంబూద్రి, వేణుగోపాల్ రెడ్డి, పాకాల రాంచందర్ తదితరులున్నారు.
తాజావార్తలు
- వాసన చూడండి..బరువు తగ్గండి
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
- కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
- కావాల్సినవి 145 పరుగులు.. చేతిలో 7 వికెట్లు
- కరోనాతో సీపీఎం ఎమ్మెల్యే మృతి
- వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్‌వో అసంతృప్తి
- వీడియో : అదిరింది..మోగింది
- చైనా వ్యాక్సిన్‌కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్
- కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన శృతి, అక్షర
- బైక్‌పై 4500 కి.మీల భారీయాత్రకు సిద్దమైన స్టార్ హీరో