శనివారం 23 జనవరి 2021
Nirmal - Dec 26, 2020 , 00:04:46

దత్త సాయి ఆలయానికి రూ.2.51 లక్షల విరాళం

దత్త సాయి ఆలయానికి రూ.2.51 లక్షల విరాళం

నిర్మల్‌ అర్బన్‌ : గండిరామన్న దత్తసాయి మందిరానికి పోడెల్లి చిన్నయ్య రూ.2,51,000 చెక్కును, రవి రూ.11 వేలను  విరాళంగా అందజేశారని ఆలయ కమిటీ అధ్యక్షుడు అప్పాల మహేశ్‌ తెలిపారు. అన్నదాన షెడ్‌ కోసం విరాళం అందించడంపై దాతలను ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గందె సుధీర్‌ కుమార్‌, కోశాధికారి బాశెట్టి రాజేంద్ర కుమార్‌, కమిటీ సభ్యులు రాజ్‌, కృష్ణారావు, సంగారి శ్రీనివాస్‌, ముత్యం రెడ్డి, చిన్నయ్య, నారాయణ గౌడ అడెల్లు, సురేశ్‌, రాజు, సాయి తదితరులున్నారు.logo