శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Dec 24, 2020 , 23:48:52

లక్ష దీపారాధన బాసరలో భక్తుల సందడి

లక్ష దీపారాధన బాసరలో భక్తుల సందడి

బాసర : బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో గురువారం భక్తుల సందడి నెలకొంది. మంచి ము హూర్తం ఉండడంతో మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఏపీ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు తమ చి న్నారులకు అక్షరాభ్యాసం జరిపించారు. సుమారు 5 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. సరస్వతీ అమ్మవారిని గురువారం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత, సీనియర్‌ నాయకుడు వేణుగోపాలాచారి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు  అధికారులు ఘన స్వాగతం ప లికారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనను శాలువాతో సన్మానించి, ప్రసాదాన్ని అందజేశారు. 

బాసర శ్రీ సరస్వతీ అమ్మవారి సన్నిధిలో గురువారం రాత్రి దీపారాధన చేశారు. మెదక్‌ జిల్లా రుసుంపేటలోని ఆత్మానంద శ్రీ ఆశ్రమం వ్యవస్థాపకుడు రాజ యోగి వెంకటస్వామి ఆధ్వర్యంలో లక్ష దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వేదభారతి పీఠం ఆధ్వర్యంలో వేద వైజయంతి ఉత్సవాలు నిర్వహించారు. గోదారమ్మకు, వేద భగవంతుడికి అభిషేకం, వేద పరాయణ స్తోత్రం, గం గాహారతి పూజలు చేశారు. పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌  సాగరబాయి, నిజామాబాద్‌ మేయర్‌ నీతుకిరణ్‌ పాల్గొన్నారు.


logo