వ్యాక్సిన్ జాబితా సిద్ధం

- నిర్మల్ జిల్లాలో 3,894 మంది గుర్తింపు
- ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కే మొదటి ప్రాధాన్యం
నిర్మల్ అర్బన్ : కరోనా టీకాను అందించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ జాబితాను సిద్ధం చేసింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు సంబంధించి దాదా పు 3894 మంది సిబ్బందిని గుర్తించారు. ఇందులో మొదటి దశలో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచ ర్లు, ఆర్బీఎస్కే, 104, 108, 102 సిబ్బందికి టీకా వేయనున్నారు. రెండో దశలో పోలీసు సిబ్బంది, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, వృద్ధు లు, వ్యాధిగ్రస్తులకు టీకాను అందించే అవకాశం ఉంది.
ఫ్రంట్‌లైన్ వారియర్‌కే మొదటి ప్రాధాన్యం..
కరోనా వైరస్‌ను అడ్డుకట్టవేయడంలో ఫ్రంట్‌లైన్ వారియర్ల పాత్ర ఎంతో కీలకం. వైరస్ కట్టడి, లాక్డౌన్ అమలు , మెరుగైన పారిశుధ్య కార్యక్రమా లు నిర్వహించడం, కరోనా వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారికి మెరుగైన వైద్యం,ఆరోగ్య సూత్రాలు బోధించడంలో ఫ్రంట్‌లైన్ వారియర్ల పాత్ర కీలకంగా ఉంది. మొదటగా వీరందరికి టీకాను అందించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కమిటీల ఏర్పాటు, పూర్తయిన శిక్షణ
కరోనా వ్యాక్సిన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. దీనికి జిల్లా వైద్యారోగ్యాశాఖ కన్వీనర్‌గా డీఎంహెచ్‌వో, కోకన్వీనర్‌గా ఇమ్యునైజేషన్ అధికారి, మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన పట్టణ కమిటీలను ఏర్పా టు చేసి పర్యవేక్షించనున్నారు. ప్రభుత్వ ఆదేశాలు రాగానే టీకాను అందించేందుకు అధికారులకు ఇప్పటికే రెండు రోజుల పాటు శిక్షణను కూడా ఇచ్చారు.
ఏర్పాట్లు చేశాం..
జిల్లాలో మొదట వైద్యులు, సిబ్బందికి వ్యాక్సి న్ ఇచ్చేందుకు చర్యలు చేప ట్టాం. దాదాపు జిల్లాలో 3800 మంది ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో విధులు నిర్వహించే సిబ్బంది జాబితాను సిద్ధం చేశాం. వ్యాక్సిన్ అందించేందుకు ఇప్పటికే వైద్యులకు శిక్షణ అందించాం. పూర్తి మార్గదర్శకాలు వచ్చిన తర్వాతనే టీకాను అందిస్తాం.
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ధన్‌రాజ్
వైద్య శాఖకు ముందుగా వ్యాక్సిన్
కరోనా వైరస్ వ్యాప్తిలోనూ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వైద్య సిబ్బం ది విధులు నిర్వర్తించారు. ఇప్పుడు ప్రభుత్వం ముం దుగా వైద్యసిబ్బందికే కరో నా వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయం. ప్రభుత్వానికి పూర్తిగా రుణపడి ఉంటాం.
- ఆర్ఎంవో డాక్టర్ వేణుగోపాలా కృష్ణ, నిర్మల్