బుధవారం 27 జనవరి 2021
Nirmal - Dec 23, 2020 , 01:09:58

రైతన్నా.. నీకు సలాం..

రైతన్నా.. నీకు సలాం..

  • కాలమేదైనా పంటలు పండించే అన్నదాత
  • అండగా నిలుస్తున్న సంక్షేమ పథకాలు  
  • నేడు అంతర్జాతీయ రైతు దినోత్సవం

నిర్మల్‌ టౌన్‌ :  జై జవాన్‌, జై కిషన్‌ ఒకరు దేశ రక్షణకు పాటుపడేవారైతే,  మరొకరు దేశానికే అన్నం పెట్టే రైతన్న. నేల తల్లిని నమ్ముకొని పంటలు పండిస్తావు. పంటకు రోగం వస్తే తల్లాడిల్లుతావు. ధాన్యం ఇంటికి వస్తే నేలతల్లికి దండం పెడుతావు. అటువంటి అన్నదాత నువ్వు సుఖంగా ఉండాలి. రైతులకు కూడా ఒక రోజు ఉంటుంది. అదే డిసెంబరు 23. నేడు అంతర్జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. 

వేలాది మందికి ఉపాధి..

నిర్మల్‌ జిల్లాలో 79 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా.. 4.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారు. వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా 1,67, 184 రైతు కుటుంబాలు జీవనాన్ని సాగిస్తుండగా.. పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొం దుతున్నారు. జిల్లాలో పత్తి, సోయా, మక్కజొన్న, పసుపు, వరి, వేరుశనగ, పప్పుదినుసులు, కూరగాయలు ఇలా రకరకాల పంటలు పండిస్తారు. ఆ పంటలే మార్కెట్‌కు వెళ్లి విక్రయించడం వల్ల పరోక్షంగా పది మందికి ఉపాధి కూడా లభిస్తోంది. రైస్‌మిల్లర్లు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రీకరణ, మోటరు పంపుసెట్ల దుకాణాలు, వ్యవసాయ కూలీలు, ఇలా ఒకరేంటి మరెందరో మందికి జీవనధారం రైతే. 

ప్రభుత్వ ప్రోత్సాహం..

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు లను అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తోంది. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడమే కాకుండా పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 5వేలు, రైతుబీమా కింద రూ.5 లక్షల నగదు, ఉచిత కరంటు , పంటలకు గిట్టుబాటు ధర వంటి సదుపాయాలు కల్పిస్తున్నది. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు, వ్యవసాయ యంత్రీరణకు ప్రోత్సాహం రైతులను సంఘటితం చేసేందుకు 79 వ్యవసాయ క్లస్టర్లను పూర్తి చేసింది. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడిపరిశ్రమను ప్రోత్సహిస్తూనే ఉద్యానవన పంటలు పండించడం వల్ల గ్రామాల్లో రైతే రాజు గా మారుతున్నారు. నిర్మల్‌ జిల్లాలో వ్యవసాయా న్ని నిమ్ముకొని బతుకుతున్న కుటుంబాలు లక్షా 20 వేలకు పైగానే ఉన్నాయి. 

వ్యవసాయమే జీవనాధారం

40 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఒక యేడు పండుతది. మరో ఏడాది ఎండుత ది. ఎండినప్పుడు బాధపడం. పండినప్పుడు మా త్రం సంతోషపడుతాం. మాకు చిన్నప్పటి నుం చి వ్యవసాయ పనులు తప్ప ఇంకేమీ రాదు. కష్టమైనా, నష్టమైనా వ్యవసాయాన్నే నమ్ముకొని బతుకుతున్నాం. ఇప్పుడు పంటలు బాగా పండుతున్నాయి. బోర్లు వేసినా ఉచితంగా కరంట్‌ వచ్చింది . పెట్టుబడి సాయం ఇస్తున్నా రు. రైతులకు ప్రభు త్వం ఇస్తున్న ప్రోత్సాహం తో ఇప్పుడు వ్యవసాయాన్ని పండుగగా చేసుకుంటున్నాం. 

-బొంతల భూమన్న, కుంటాల

వ్యవసాయ పనులతోనే ఉపాధి.. 

నేను, నా భార్య వ్యవసాయ పనులకు వెళ్తుంటాం. ఇద్దరికీ రోజుకు కలిపి రూ. 800 కూ లి వస్తున్నది. వచ్చిన డబ్బులతో సంతోషంగా ఉంటు న్నాం. చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనులు చేసుకోవడంతో ఏ ఊరికి వెళ్లకుండా సొంత ఊర్లోనే  జీవనం సాగిస్తున్నాం. 

-రాజేశ్వర్‌, కూలీ రైతు

ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది..

వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ. 5 వే లు ఇస్తున్నారు.  రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా, 24 గంటల ఉచిత కరంట్‌, పంటలకు గిట్టుబాటు ధర అందిస్తున్నారు. బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకే రుణాలను ఇప్పిస్తున్నారు. సకాలంలో రుణం చెల్లిస్తే అసలుపై వడ్డీ మాఫీ చేస్తున్నారు. ప్రోత్సాహం ఉన్నంత వరకు వ్యవసాయం చేస్తూనే ఉంటాం.                        

-సాయారెడ్డి, చిట్యాల్‌logo