సమష్టి కృషితోనే సక్సెస్ అయ్యాం

- రైతు వేదికల నిర్మాణంలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా రెండోస్థానం
- కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
- అధికారులకు అభినందనలు, ఘన సన్మానం
నిర్మల్ టౌన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలను తక్కువ కాలంలో పూర్తిచేసుకొని రాష్ట్రంలోనే జిల్లా రెండోస్థానం ద క్కించుకోవడం అభినందనీయమని నిర్మల్ కలెక్ట ర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. 79 క్లస్టర్ల పరిధిలో రైతు వేదికల నిర్మాణానికి అహర్నిశలు కృషిచేసిన వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో మంగళవారం విశ్రాంతి భవనంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అందరి కృషితో నేడు రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచామని తెలిపారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీ దుగా ఇప్పటికే వేధికలను ప్రారంభించినట్లు చె ప్పారు. ఈ సందర్భంగా రైతు వేదికల నిర్మాణం లో కష్టపడి పని చేసిన జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, డీఈ తుకారాం, ఏడీఏలు వినయ్‌బాబు, వీణా, యూనిస్, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, ఏఈవోలను ఘనంగా సన్మానించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.
వ్యాక్సినేషన్‌కు కార్యాచరణ రూపొందించుకోవాలి..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా వైద్యాధికారులతో కొవిడ్-19 వ్యాక్సినేషన్ అమలుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ అమలుకు టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తాను చైర్మన్‌గా, జిల్లా వైద్యాధికారి కన్వీనర్‌గా, 17 శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. జిల్లాకు వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ప్రత్యేక సిబ్బంది ద్వారా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇవ్వనున్నట్లు వివరించారు. ఇప్పటికే అన్ని శాఖల్లోని ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో నమోదుచేసినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి ధన్రాజు, అవినాశ్ పాల్గొన్నారు.
సోన్ పీహెచ్సీ సందర్శన..
సోన్ : సోన్ పీహెచ్‌సీని కలెక్టర్ సందర్శించారు. పౌష్ఠికాహార లోపం వల్ల పిల్లల్లో ఎదుగుదల నిలిచిపోతున్నదని, దీంతో అనారోగ్యానికి గురవుతారని కలెక్టర్ అన్నారు. దాని ప్రాధాన్యత తెలిపి పోషకాహారం అందేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. బాధిత పిల్లలకు ప్రభుత్వ వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలకు అందుతున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి స్రవంతి, తహసీల్దార్ లక్ష్మి, వైద్యులు రమ్యారెడ్డి, అవినాశ్, వైద్య సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
- ఎన్నికల వేళ మమతా దీదీకి మరో ఎదురుదెబ్బ?
- యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం
- 'ధరణితో భూ రికార్డులు వ్యక్తుల చేతుల్లోంచి వ్యవస్థలోకి'
- శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌పై విప్ బాల్క సుమన్ సమీక్ష
- "ఉపశమనం కోసం లంచం" కేసులో డీఎస్పీ, ఇన్స్పెక్టర్ అరెస్ట్
- క్రాక్ 2 ఆయనతో కాదట..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
- స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు