Nirmal
- Dec 21, 2020 , 00:12:48
అడవి పందులను తరలిస్తున్న వాహనం పట్టివేత

లోకేశ్వరం : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని ఆయా గ్రామాల్లో పంట పొలాల్లో పట్టుకున్న 11 అడవి పందులను బొలెరో వాహనంలో నల్గొండ జిల్లా సూర్యపేటకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ యాసిర్ అరాఫత్ తెలిపారు. ఆదివారం పెట్రోకార్ఫ్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. అడవి పందులను తరలిస్తున్న వాహనాన్ని ఎస్ఐ తనిఖీ చేశారు. 11 అడవి పందులను తరలిస్తున్నట్లు గుర్తించి.. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన వేద ముత్తయ్య, లక్కంపెల్లి హన్మంతును అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. వాటిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఎఫ్ఆర్వో వాణి వాటిని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి పంపుతున్నట్లు తెలిపారు. వీరి వెంట పోలీసు, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING