శనివారం 16 జనవరి 2021
Nirmal - Dec 21, 2020 , 00:15:42

అనాథ శవానికి అంత్యక్రియలు

అనాథ శవానికి అంత్యక్రియలు

నిర్మల్‌ టౌన్‌ : నిర్మల్‌ పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీలో అమ్మ వృద్ధ్దాశ్రమం లో ఉంటున్న ఓ వృద్ధుడు మృతిచెందాడు. దీంతో ఆయనకు నిర్మల్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సాజిద్‌ అహ్మద్‌తో పాటు సహారా యూత్‌ సభ్యులు ఆదివారం అం త్యక్రియలు నిర్వహించారు. మూడేండ్ల నుంచి ఆశ్రమంలో ఉంటున్న వృద్ధుడు మృతి చెందడంతో నిర్వాహకురాలు 100 నంబర్‌కు కాల్‌ చేశారు. నిర్మల్‌ రూరల్‌ పోలీసులతో పాటు సహారా యూత్‌ సభ్యులు అక్కడికి చేరుకొని వృద్ధుడికి దహనసంస్కారాలు నిర్వహించారు. కార్యక్రమంలో సహారా యూత్‌ సభ్యు లు ఇర్ఫాన్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.