బుధవారం 27 జనవరి 2021
Nirmal - Dec 20, 2020 , 01:34:13

మూషిక జింకలొస్తున్నాయ్‌..

మూషిక జింకలొస్తున్నాయ్‌..

  • నేడు గండి రామన్న హరితవనంలో వదిలిపెట్టనున్న మంత్రి
  • రూ.8 లక్షల వ్యయంతో  జింకల పార్కు ఏర్పాటు
  • నేడు ప్రారంభించనున్న  అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ అర్బన్‌ : గండిరామన్న హరితవనం పార్కులో రూ.8 లక్షల వ్యయంతో అర ఎకరం విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మూషిక జింకల పార్కులో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదివారం మూషిక జింకలను వదిలిపెట్టనున్నారు. ఇందులో వాటి కోసం ప్రత్యేకం గా ఎనక్లోజర్లను ఏర్పాటు చేశారు. ఒకటి మగ, మూడు ఆడ జింకలను పార్కులోకి వదలనున్నారు. మూషిక జింకల పునరుత్పత్తి కోసం అటవీ శాఖ అధికారులు ప్రత్యే క ఏర్పాట్లు చేశారు. పునరుత్పత్తి తర్వాత వాటిని అడవుల్లోకి వదిలివేస్తారు. నెహ్రూ జూ పార్క్‌లో పునరుత్పత్తి కేంద్రం నుంచి వీటిని నిర్మల్‌కు తీసుకువచ్చారు.logo