బడాబాబుల కోసమే అగ్రి చట్టాలు

- రైతులు వ్యతిరేకించినా బీజేపీ సర్కారు పట్టించుకోవడం లేదు..
- కేంద్రం నిధులు భిక్షకాదు.. రాష్ర్టాల హక్కు..
- కేసీఆర్‌పై చౌకబారు విమర్శలు మానుకోవాలి..
- 60 ఏళ్ల దుఃఖాన్ని ఆరేండ్లలో పోగొట్టిన నాయకుడు
- బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కేసీఆర్ పథకం ఒక్కటైనా అమలు చేసి చూపండి
- వ్యవసాయ విధానంలో దేశానికి తెలంగాణే ఆదర్శం
- రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
- మంత్రి అల్లోలతో కలిసి చిట్యాల, దిలావర్పూర్లో రైతు వేదికలు ప్రారంభం
- హాజరైన రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి
“కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకే కొమ్ముకాసేలా ఉన్నాయని, రైతులను తీవ్రనష్ట పర్చుతాయని, అందుకే మేం వ్యతిరేకిస్తున్నామని” రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మండలం చిట్యాల, ఖానాపూర్ మండలం దిలావర్పూర్ గ్రామాల్లో రైతు వేదికలను శనివారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ విధానంపై తీవ్రంగా విమర్శించారు. అగ్రి చట్టాలు తీసుకురావడంపై ధ్వజమెత్తారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలబడితే బీజేపీ నాయకులు జీర్ణించుకోవడం లేదన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. సీఎంను విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
- సోన్/నిర్మల్ టౌన్/ఖానాపూర్ రూరల్
సోన్/నిర్మల్ టౌన్ / ఖానాపూర్ రూరల్ : ‘తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది.. తెచ్చుకున్న తెలంగాణలో 60 ఏళ్ల వ్యవసాయ అభివృద్ధి చూడండి.. ఆరేండ్ల కాలంలో జరిగిన వ్యవసాయ అభివృద్ధి చూడండి.. ఇటీవల కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు కొమ్ముకాసేలా ఉన్నాయి.. వ్యవసాయాన్ని సంపన్నులకు ధారాదత్తం చేసేందుకే కొత్త చట్టాలను తెచ్చారు.. ఆ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం.. అందుకే ఆ చట్టాలను మేం వ్యతిరేకిస్తున్నాం” అన్నారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నిర్మల్ మండలం చిట్యాల, ఖానాపూర్ మండలం దిలావర్పూర్ గ్రామంలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని, సత్తెనపెల్లిలో ఏఆర్ఎస్ ఆగ్రో రైస్ మిల్లును శనివారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. నదులు, చెరువులు, ప్రాజెక్టులు, కాలువల్లో ప్రస్తుతం నీళ్లు గలగలపారుతున్నాయని తెలిపారు.
కొత్త వ్యవసాయ చట్టాలతో సంపన్నులకే లాభం..
రైతులను ఆదుకోవాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయాన్ని ధారాదత్తం చేసేలా కొత్త చట్టాలను తీసుకొస్తుందన్నారు. ఈ చట్టాలతో సంపన్నులకే లాభమని, కష్టపడి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండదని పేర్కొన్నారు. దళారులు చెప్పిందే ధర ఉంటుందన్నారు. రైతు వద్ద రూ.10కి కొన్న సరుకు బడా వ్యాపారి అదే సరుకును కృత్రిమ కొరత సృష్టించి రూ.100కు అమ్మితే క్యూలో నిలబడి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని వాపోయారు. అలాంటి చట్టాలపై రైతులు 30 రోజులుగా ఢిల్లీలో పోరాటం చేస్తుంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే పంజాబ్, హర్యానా రాష్ట్రంలో ప్రారంభమైన రైతు యుద్ధం క్రమంగా దక్షాణాది రాష్ర్టాలకు విస్తరించిందని పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన నిలబడితే బీజేపీ నాయకులు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని, ఆయనకు వ్యవసాయంపై విజ్ఞానం ఉందని గుర్తు చేశారు.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో విదేశాల్లో పండించిన ధాన్యాలు దేశానికి వస్తే ఇక్కడ పండించిన రైతు పరిస్థితి ఏమి కావాలని ప్రశ్నించారు. అందుకే నూతన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఆరేండ్లలో సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేసిన ఒక్క పథకమైనా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రిని మెచ్చుకుంటున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రిని బీజేపీ నాయకులు స్థాయిని మరిచి విమర్శిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని 135 కోట్ల ప్రజల ద్వారా వచ్చిన పన్నులను కేంద్రానికి పంపితే అందులో సగం కూడా రాష్ర్టాలకు కూడా ఇస్తలేరన్నారు. మనం రూ.100 పన్ను కడితే.. వారిచ్చేది రూ.40 మాత్రమేనన్నారు. ఆ నిధుల కోసం అడిగితే బీజేపీ నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై దాడులు చేస్తున్నారని, అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. మాటలు మాట్లాడే ముందు ప్రజలకు మనం ఏమి చేశామో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
రైతులు ఒకచోట చేరి మాట్లాడవచ్చు : అల్లోల
రైతువేదిక ద్వారా క్లస్టర్‌లోని రైతులు ఒకచోట చేరి మాట్లాడుకోవచ్చని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని 79 వ్యవసాయ క్లస్టర్లు పూర్తయ్యాయని తెలిపారు. రైతు వేదికల నిర్మాణంతో రైతులందరూ కూడా ఒకే వేదికపై సమావేశమై పంటల సాగు విధానం, అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని అభినందించారు. ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటగా చిట్యాల్ రైతువేదిక పనులు పూర్తి చేసిన సర్పంచ్ పడకంటి రమేశ్‌రెడ్డిని అభినందించారు. ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా చూడాలని మంత్రులు నిరంజన్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి వినతిపత్రాలు అందించారు.
అనంతరం రాష్ట్ర మంత్రులు రైతుబీమా పథకం కింద మంజూరైన రూ.5లక్షల చెక్కును లక్ష్మికి అందించారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ పడకంటి రమేశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదాముత్యంరెడ్డి, సోన్ జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజిగారి రాజేందర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, నాయకులు అల్లోల మురళీధర్‌రెడ్డి, రాంకిషన్‌రెడ్డి, నల్లా వెంకట్రామ్రెడ్డి, ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ కడార్ల గంగనర్సయ్య, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, దిలావర్పూర్ సర్పంచ్ మిర్యాల హరిత ప్రతాప్ రావ్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వాట్సాప్‌కు భారత ప్రభుత్వం వార్నింగ్
- ఇదీ మా సత్తా: విరాట్ కోహ్లి
- అక్కడ మంత్రి కావాలంటే ఎన్నికల్లో గెలువాల్సిన పనిలేదు..
- ముంబై, పుణెలో ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రైవ్
- చిరంజీవి నన్ను చాలా మెచ్చుకున్నారు..
- టీమిండియాకు 5 కోట్ల బోనస్
- టెస్ట్ చాంపియన్‌షిప్‌లో నంబర్ వన్ టీమిండియా
- టీమిండియాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు
- 1988 తర్వాత.. గబ్బా కోట బద్దలు
- అమ్మో! సూది మందా? నాకు భయ్యం..