మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Dec 19, 2020 , 01:13:12

పోస్టల్‌ ద్వారా ఇంటికే శబరిమల ప్రసాదం

పోస్టల్‌ ద్వారా ఇంటికే శబరిమల ప్రసాదం

నిర్మల్‌ అర్బన్‌ : పోస్టల్‌ శాఖ ద్వారా ఇంటికే శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం అందిస్తున్నారని, ఈ సేవలను అయ్యప్ప స్వాములు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని గురుస్వామి పాకాల రాంచందర్‌ తెలిపారు. హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో శుక్రవా రం  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని భక్తుల ఇంటివద్దకే శబరిమల అయ్యప్ప ప్ర సాదాన్ని పోస్ట్‌ ఆఫీస్‌ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. రూ.450తో ముందుగా బుక్‌ చేసుకున్నవారికి ఇంటి వద్దకే ప్రసాదాన్ని పం పిణీ చేస్తారని  పేర్కొన్నారు. ఇందులో ప్రసా దం, పసుపు, కుంకుమ, విభూతి, అభిషేకం చేసిన నెయ్యి, అర్వన్నం ఉంటాయని, కావాల్సిన వారు పోస్టాఫీసులో సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం భక్తులకు వెసులుబాటు కలిగే ఇలాంటి కార్యక్రమాలు చేపట్ట డం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో హరిహర క్షేత్రం ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి, కోశాధికారి వేణుగోపాల్‌రెడ్డి, సంతోష్‌, పూర్ణచందర్‌, సుమన్‌, ప్రసాద్‌, వెంకట్‌, రత్నాకర్‌, సురేందర్‌, పోస్ట్‌మాస్టర్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.