సోమవారం 18 జనవరి 2021
Nirmal - Dec 18, 2020 , 02:25:19

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

నిర్మల్‌ అర్బన్‌ : జిల్లాలోని వైద్య శాఖలో వివిధ పోస్టుల భర్తీకి నిరుద్యోగ యువకులు దరఖాస్తులు చేసుకోవాలని  నిర్మల్‌ జిల్లా వైధ్యాదికారి ధన్‌రాజ్‌ గురువారం ప్రకటనలో తెలిపారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఖాళీలు భర్తీ చేయనున్నట్లు వివరించారు. ల్యాబ్‌ మేనేజర్‌ పోస్టుకు ఎంఎస్సీ బయో కెమిస్ట్రీ,మైక్రోబయోలజీ పూర్తి చేసి రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని, మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న స్త్రీ, పురుషులు,ఈనెల 24 వరకు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. రిఫ్రిజిరేటర్‌ మెకానిక్‌గా పని చేసేందుకు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. అలాగే  కాంట్రాక్టు ప్రాతిపదికన ఆరు నెలల కాలానికి వైద్యాధికారులుగా పని చేయడానికి ఎంబీబీఎస్‌ చేసిన అభ్యర్థులు  దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారు అర్హులని వెల్లడించారు. అభ్యర్థులు nirmal. telangana.gov.in  నుంచి దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఈనెల 24 లోగా జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.