శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Dec 18, 2020 , 02:17:59

వావ్‌.. మహబూబ్‌ ఘాట్స్‌

వావ్‌.. మహబూబ్‌ ఘాట్స్‌

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రకృతి అందాలకు కొదువలేదు.. పచ్చని చెట్లు.. గలగలపారే జలపాతాలు.. దట్టమైన అడవులు.. వన్యప్రాణులు.. ఇలా జిల్లా అందాలను చాలా వరకు వర్ణించవచ్చు.. ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అందాలను వెండితెరపైకి ఎక్కించి అనేక చిత్రాలను తీశారు.. నిర్మల్‌-ఆదిలాబాద్‌ జిల్లా జాతీయ రహదారి ప్రాంతంలో సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్న మహబూబ్‌ ఘాట్స్‌ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.. ఎత్తైన కొండలు, చుట్టూ అటవీ ప్రాంతాలు, కొండలను చీల్చుకుంటూ సాగే ప్రయాణం.. అక్కడక్కడా ప్రమాదకరమైన ప్రదేశాలున్నప్పటికీ ఈమార్గం గుండా వెళ్లేందుకు ప్రయాణికులు ఇష్టపడుతారు. మహబూబ్‌ ఘాట్స్‌ అందాలను ఆదివారం డ్రోన్‌తో తీసిన చిత్రమిది. 

- నిర్మల్‌ అర్బన్‌