శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Dec 17, 2020 , 01:09:49

భక్తుల నగదు, సెల్‌ఫోన్‌ అప్పగింత

భక్తుల నగదు, సెల్‌ఫోన్‌  అప్పగింత

బాసర :  బాసర అమ్మవారి క్షేత్రంలోని వాగ్దేవి లేబర్‌ సిబ్బంది, గోదావరి వద్ద గంగపుత్రులు తమ మానవత్వాన్ని నిరూపించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓంకార్‌ తన కుటుంబంతో కలిసి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చారు. అనంతరం  హడావిడిలో అక్కడే రూ.6, 400 నగదు, సెల్‌ఫోన్‌ను మరిచి వెళ్లిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆలయ ఎన్‌ఎంఆర్‌లు సతీశ్‌, నారాయణ, మహేందర్‌ గమనించి వాటిని భద్రపరిచారు. తిరిగి భక్తులు రాగానే వివరాలు అడిగి వారికి అప్పగించారు.   భక్తులు, ఆలయ సిబ్బంది అభినందించారు.