శభాష్.. ప్రవీణ్‌కుమార్

- అగ్రిటెక్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారికి అరుదైన గౌరవం
- ఉప రాష్ట్రపతి చేతులమీదుగా రైతు నేస్తం అవార్డు
సోన్ : అగ్రిటెక్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారి మంగ్లారపు ప్రవీణ్‌కుమార్‌కు అరుదైన గౌరవం దక్కింది. నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాంద, సోన్ మండలాల రైతులకు మిశ్రమ సేంద్రియ సాగుపై అవగాహన కల్పించినందుకు గాను ఆయనకు రైతు నేస్తం అవార్డు వరించింది.
ఈ మేరకు హైదరాబాద్‌లోని శంషాబాద్ స్వర్ణభారతి ట్రస్ట్ భవన్లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా దానిని అందుకున్నారు. లక్ష్మణచాంద, సోన్ మండలాలకు వ్యవసాయాధికారిగా, అగ్రిటెక్ ఉమ్మడి జిల్లా అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఆయనకు వ్యవసాయమంటే మక్కువ. విధులు నిర్వహిస్తూనే తనకున్న పొలంలో వివిధ రకాల పంటలను సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్నారు. పండ్ల తోటల పెంపకం కూడా చేపడుతున్నారు. ఇటీవల రైతు నేస్తం యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించి, సేంద్రియ వ్యవసాయంపై రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
తాజావార్తలు
- వ్యాక్సిన్‌పై అపోహలు అవసరం లేదు : మంత్రి గంగుల కమలాకర్
- తెలుగు రాష్ర్టాల సీఎంలకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ
- సోనూసూద్ టైలరింగ్ షాప్.. కస్టమర్ దుస్తులకు నో గ్యారంటీ! ..వీడియో వైరల్
- రామ్ చరణ్, రోజా.. ఇద్దరూ ఇష్టపడేది ఆ హీరోనే
- టీకా దుష్ప్రభావాలపై పరిహారం పొందాలంటే..
- టెస్లాతో భాగస్వామ్యమా? నో వే అంటున్న టాటా
- కరోనా 'పేషెంట్ జీరో'ను ఎన్నటికీ గుర్తించలేం..
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల గెజిట్ విడుదల
- కోహ్లీ ఉంటే కథ వేరేలా ఉండేది..!
- ప్రాధాన్య క్రమంలో అందరికి కరోనా టీకా : మంత్రి జగదీశ్‌రెడ్డి