శ్యాంగఢ్ కోటకు సొబగులు

- రూ.30 లక్షల నిధులతో చకచకా అభివృద్ధి పనులు
- త్వరలో మంత్రి అల్లోల చేతుల మీదుగా ప్రారంభం
- పర్యాటకులను ఆకట్టుకుంటున్న కోట అందాలు
నిర్మల్ అర్బన్ : నిర్మల్ జిల్లా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. ఇప్పటికే జిల్లాలో చారిత్రక కోటలు, బురుజులు, గొలుసు కట్టు చెరువులు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొయ్య బొమ్మలతో పర్యాటకంగా ప్రసిద్ధిగాంచింది. నిమ్మనాయుడి పరిపాలన కాలంలో 500 ఏండ్ల క్రితం నిర్మించిన కోటలు ప్రస్తుతం చారిత్రక ఆనవాళ్లు కోల్పోతున్నాయి. ప్రాచీన కట్టడాలు శిథిలావస్థకు చేరుతున్న తరుణంలో చరిత్ర భావితరాలకు తెలిసేలా, కట్టడాలకు పూర్వవైభవం తీసుకొచ్చేలా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ఇందుకుగాను అధికారులకు అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో కనుమరుగవుతున్న కోటకు పూర్వవైభవం రానుంది.
కోట అభివృద్ధికి చర్యలు..
నిర్మల్ జిల్లా ముఖద్వారానికి జాతీయ రహదారి పక్కనున్న శ్యాంగఢ్ కోట అభివృద్ధికి మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మున్సిపల్ నిధులు రూ.30 లక్షలతో కోటకు మరమ్మతు చేయిస్తున్నారు. కోట చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. పెద్దలు కూర్చునేందుకు, చిన్నారులు ఆడుకునేందుకు ఖాళీ స్థలాన్ని చదును చేస్తున్నారు. కోట చుట్టూ విద్యుత్ బల్బులు అమర్చడంతో జిగేల్మని మెరుస్తున్నది. ఉదయం వేళ పర్యాటకులను ఎలా ఆకట్టుకుంటుందో అంతకు రెట్టింపుగా రాత్రి వేళ ఆకట్టుకునేలా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. శ్యాంగఢ్ కోటలో ఇప్పటికే నిర్మల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కోటలోకి వెళ్లేలా సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశారు. పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా గతంలోనే సిమెంట్ బెంచీలు, బల్లలు నిర్మించారు.
పర్యాటకులను ఆకట్టుకుంటున్నకోట
నిమ్మనాయుడి కాలంలో శత్రు సైన్యం దండెత్తేందుకు వస్తే తమ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు చుట్టూ కోటను నిర్మించారు. నిర్మల్ పట్టణంలో శ్యాంగఢ్, బత్తీస్గఢ్ కోటలను ఏర్పాటు చేసుకుని దండయాత్రను నిర్వహించే వారు. వందల ఏండ్ల క్రితం నిర్మించిన ఈ కోటలు ప్రస్తుతం ఆనవాళ్లు కోల్పోతున్నాయి. చారిత్రక ఆనవాళ్లను కాపాడాలనే ఉద్దేశంతో శ్యాంగఢ్ కోటను అభివృద్ధి చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో పట్టణవాసులతోపాటు అటు వైపుగా వెళ్లే వేలాది మంది ప్రయాణికులను ఆకట్టుకుంటున్నది. ఉపాధ్యాయులు కోటను సందర్శించి విద్యార్థులకు చారిత్రక సంపద గురించి పాఠ్యాంశాల్లో బోధించేందుకు ఇక్కడికి తీసుకొచ్చేవారు. అలాగే వీటితోపాటు ఉన్న బత్తీస్గఢ్ కోటను అభివృద్ధి పర్చాలని పర్యాటకులు, పట్టణ వాసులు కోరుతున్నారు. కాగా.. మంత్రి అల్లోల చొరవతో పనులు చురుకుగా సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ప్రగతి పనులు పూర్తయితే ఈ ప్రాంతం పర్యాటకులకు ఆహ్లాదం పంచనుంది.
చరిత్రను కాపాడుకునేందుకే అభివృద్ధి పనులు
నిర్మల్ జిల్లాకు ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉంది. గతంలో ఉన్న పాలకులు వాటిపై దృష్టి సారించక, అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో చరిత్ర శిథిలమ వుతున్నది. పురాతన చరిత్రను భవిష్యత్ తరాలకు అం దించి నిర్మల్ జిల్లా చరిత్రను చాటిచెప్పేలా అభివృద్ధి పనులు సాగుతున్నాయి.
- కత్తి సుధాకర్, నిర్మల్
అభివృద్ధి మాంత్రికుడు అల్లోల
నిర్మల్ జిల్లాను ఇతర జిల్లాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అభివృద్ధే ధ్యేయంగా మంత్రి అల్లోల ఇంద్రకర ణ్‌రెడ్డి ముందుకెళ్తున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో నిర్మల్ పట్టణానికి ఆర్చ్‌లు, ఫౌంటేయిన్, సెంట్రల్ లైటింగ్, హైమాస్ట్ లైట్లతో నూతన శోభను తీసుకువచ్చిన మంత్రి.. పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో నిధులను ఖర్చు చేస్తున్నారు.
- గండ్రత్ ఈశ్వర్, మున్సిపల్ చైర్మన్, నిర్మల్.
తాజావార్తలు
- మరో నాలుగు రోజులు..
- గ్రామాల అభివృద్ధేప్రభుత్వ ధ్యేయం
- ‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396
- నేటి నుంచి నిరంతరాయంగా..
- ఆకాశం హద్దుగా!
- పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
- కోడేరు అభివృద్ధ్దికి కంకణం కట్టుకున్నా
- ప్రభుత్వభూమి ఆక్రమణపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి
- నల్లమల ఖ్యాతి నలుదిశలా విస్తరించాలి